ETV Bharat / international

రికార్డు బ్రేక్​- అక్కడ మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రత!

ఉత్తరార్ధ గోళంలో నమోదైన అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతను ప్రపంచ వాతావరణ సంస్థ గుర్తించింది. 1991 డిసెంబర్ 22న క్లింక్ అనే ప్రాంతంలో -69.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు ధ్రువీకరించింది. ఫలితంగా 1897, 1993లో రష్యాలోని ఒయిమికోన్​లో నమోదైన -67.8 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత రికార్డు బద్దలైంది.

UN unearths record low temperature for Northern Hemisphere
రికార్డు బద్దలు- అక్కడ మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రత!
author img

By

Published : Sep 23, 2020, 5:35 PM IST

మూడు దశాబ్దాల క్రితం గ్రీన్​లాండ్​లో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) తెలిపింది. ఉత్తరార్ధ గోళంలో రికార్డయిన కనిష్ఠ ఉష్ణోగ్రత ఇదేనని తెలిపింది. 1991 డిసెంబర్ 22న 'క్లింక్'​ ప్రాంతంలో ఉన్న వాతావరణ కేంద్రం వద్ద -69.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు ధ్రువీకరించింది. గ్రీన్​లాండ్ మంచు ఫలకలోని ఎత్తైన ప్రాంతానికి సమీపంలోనే క్లింక్ ప్రదేశం ఉన్నట్లు పేర్కొంది.

తాజా ఉష్ణోగ్రతతో రష్యాలోని ఒయిమికోన్​లో ఇదివరకు నమోదైన రికార్డు బద్దలైంది. ఈ ప్రాంతంలో 1897, 1993లో -67.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

"వాతావరణ మార్పులు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మన దృష్టంతా అధిక ఉష్ణోగ్రతల రికార్డులపైనే ఉంది. తాజాగా గుర్తించిన శీతల ఉష్ణోగ్రత వివరాలు.. భూమి మీద ఉన్న వైరుద్ధ్య పరిస్థితులను జ్ఞాపకానికి తెస్తోంది."

-ప్రొఫెసర్ పెట్టేరీ తాలస్, డబ్ల్యూఎంఓ ప్రధాన కార్యదర్శి

క్లింక్​లో నమోదైన ఈ ఉష్ణోగ్రతను డబ్ల్యూఎంఓ తరఫున పనిచేసే క్లైమేట్ డిటెక్టివ్స్​ గుర్తించారు. ఉష్ణోగ్రతలతో పాటు, అత్యధిక వర్షపాతం, వడగండ్ల వానలు, సుదీర్ఘ కాలంపాటు ఏర్పడిన మెరుపులు వంటి రికార్డులను గుర్తించేందుకూ వీరు ప్రయత్నిస్తున్నారు.

తాజా రికార్డు ఉత్తరార్ధ గోళానికి సంబంధించినది కాగా.. భూగోళంపై అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత అంటార్కిటికాలో నమోదైంది. 1983లో వోస్తోక్​ వాతావరణ కేంద్రం వద్ద -89.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.