ETV Bharat / international

కరోనా టీకా తొలి డోసు తీసుకున్న ఐరాస చీఫ్​ - ఆంటోనియో గుటెరస్​ అప్డేట్స్​

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​ కొవిడ్​-19 టీకా​ తొలి డోసు తీసుకున్నారు. వ్యాక్సినేషన్​ అనంతరం హర్షం వ్యక్తం చేసిన ఆయన.. ఇందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

UN chief Antonio Guterres receives COVID-19 vaccine
కరోనా వ్యాక్సిన్​ తీసుకున్న ఐరాస చీఫ్​ గుటెరస్​
author img

By

Published : Jan 29, 2021, 12:38 PM IST

ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్.. కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు. 71 ఏళ్ల గుటెరస్​కు.. న్యూయార్క్​ సిటీ పబ్లిక్​ స్కూల్​లో మోడెర్నా వ్యాక్సిన్​ తొలి డోసు ఇచ్చారు వైద్యులు. వ్యాక్సినేషన్​ అనంతరం హర్షం వ్యక్తం చేశారు గుటెరస్​.

వ్యాక్సినేషన్​ ప్రక్రియ అన్ని దేశాల్లో ప్రారంభమైందని.. అందరికీ అందుబాటులో ఉండేలా ఆయా దేశాలు చర్యలు చేపట్టాలని తెలిపారు గుటెరస్​. ప్రజలు కూడా వీలైనంత త్వరగా టీకా తీసుకోవాలని ట్విట్టర్​ వేదికగా కోరారు.

  • My admiration and gratitude to everyone who has worked to safeguard communities during this pandemic and make a #COVID19 vaccine a reality.

    Their perseverance & solidarity are an example to us all. pic.twitter.com/f9NErnijMN

    — António Guterres (@antonioguterres) January 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • I am very thankful to the City of New York for including @UN staff and diplomats in their #COVID19 vaccination programme.

    Solidarity is crucial in our global fight against the pandemic.pic.twitter.com/z9WXm60OiS

"ఈ రోజు నేను కరోనా టీకా తొలి మోతాదు వేయించుకున్నాను. ఇది నా అదృష్టం. వ్యాక్సినేషన్​కు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు. టీకా అందరికీ అందుబాటులో ఉండేలా ఆయా దేశాలు చర్యలు చేపట్టాలి. మహమ్మారి నుంచి మనమందరం సురక్షితంగా బయటపడాలని ఆకాంక్షిస్తున్నా."

- ఆంటోనియో గుటెరస్​, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి

ఇదీ చదవండి: లిక్విడ్ నైట్రోజన్ లీక్- ఆరుగురు మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.