ETV Bharat / international

ఆంక్షలు బేఖాతరు- ఆగని కిమ్ అణు కార్యకలాపాలు - North Korea nuclear weapons

ఉత్తర కొరియా అణ్వాయుధ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉందని ఐరాస ఆంక్షల కమిటీ పేర్కొంది. ఆయుధాల ఆధునీకరణ కోసం అవసరమయ్యే సాంకేతికతను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోందని తెలిపింది. ఈ మేరకు ఓ నివేదిక రూపొందించింది. దీన్ని భద్రతా మండలికి పంపించింది.

UN experts say North Korea still modernising nuclear arsenal
ఆంక్షలు బేఖాతరు- ఆగని కిమ్ అణు కార్యకలాపాలు
author img

By

Published : Feb 9, 2021, 11:31 AM IST

ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా అణ్వాయుధ ఆధునికీకరణ కొనసాగిస్తోందని ఐరాస ఆంక్షల కమిటీ తెలిపింది. ఈ కార్యక్రమాల కోసం అవసరమైన పరికరాలు, సాంకేతికతను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోందని వెల్లడించింది. అణ్వాయుధ నవీకరణ కోసం కీలకమైన పదార్థాలను ఉత్పత్తి చేస్తోందని స్పష్టం చేసింది. ఈ నివేదికను భద్రతా మండలికి పంపించింది. తన అణు కర్మాగారాలనూ కొనసాగిస్తోందని పేర్కొంది.

"స్వల్ప, మధ్య శ్రేణి క్షిపణులు, సబ్​మెరైన్ నుంచి ప్రయోగించే క్షిపణులు, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా తన మిలిటరీ పరేడ్​లో ప్రదర్శించింది. కొత్త బాలిస్టిక్ క్షిపణుల వార్​హెడ్లను పరీక్షించి, ఉత్పత్తి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. వ్యూహాత్మక అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోంది. బాలిస్టిక్ మిసైల్ మౌలిక సదుపాయాలను ఆధునికీకరించింది."

- ఐరాస ఆంక్షల కమిటీ

2006లో తొలిసారి అణు పరీక్షలు నిర్వహించినప్పటి నుంచి ఉత్తర కొరియాపై కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది ఐరాస భద్రతా మండలి. ఆ దేశ ఎగుమతులపై దాదాపుగా నిషేధం విధించింది. దిగుమతులను చాలా వరకు పరిమితం చేసింది.

అయితే ఈ ఆంక్షలను తప్పించుకొని తన అణు కార్యక్రమాలను కొనసాగిస్తోంది కిమ్ సర్కార్. శుద్ధి చేసిన పెట్రోలియాన్ని అక్రమంగా దిగుమతి చేసుకుంటోంది. అంతర్జాతీయ బ్యాంకింగ్ ఛానెళ్లను ఉపయోగించుకుంటోంది. తీవ్రమైన సైబర్ కార్యకలాపాలకు పాల్పడుతోంది.

ఇదీ చదవండి: అమెరికాకు కిమ్ 'అణ్వాయుధ'​ హెచ్చరికలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.