ETV Bharat / international

'కరోనా పరీక్షలు, టీకా కోసం 3500 కోట్ల డాలర్లు అవసరం' - uno laatest news

కరోనా మహమ్మారిపై పోరుకు అవసరమైన 35 బిలియన్​ డాలర్ల అంతరాన్ని పూడ్చేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. టీకా ఉత్పత్తి, చికిత్స, పరీక్షల విషయంలో అంతర్జాతీయ లక్ష్యాలను చేరుకోవటానికి ఆర్థిక సాయం అవసరమని పేర్కొంది.

COVID-19
ఐక్యరాజ్యసమితి
author img

By

Published : Sep 29, 2020, 11:54 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సిన్​ ఉత్పత్తి, చికిత్స, పరీక్షల కోసం దేశాలన్నీ సాయం చేయాలని ఐక్య రాజ్య సమితి పిలుపునిచ్చింది. ఈ లక్ష్యాలను చేరుకోవటానికి అవసరమైన 35 బిలియన్ డాలర్ల అంతరాన్ని పూరించడానికి ప్రపంచ దేశాలు ముందుకు రావాలని ఐరాస డిప్యూటీ చీఫ్ అమీనా మహమ్మద్ కోరారు.

"ప్రముఖ అంతర్జాతీయ ఆరోగ్య వ్యవస్థలు, పరిశోధన సంస్థలు, ప్రైవేటు రంగాలు అవిరామంగా కృషి చేస్తున్నాయి. ఇప్పటికే విజయం దిశగా పయనిస్తున్నాం. చిన్న, మధ్య ఆదాయ దేశాల కోసం వేగవంతమైన చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చాయి. వ్యాక్సిన్​ పంపిణీకి 156 దేశాలు నిబద్ధతతో ఉన్నాయి. ఇప్పటివరకు 3 బిలియన్ డాలర్ల నిధులు సమకూరాయి. పూర్తి స్థాయి పరిష్కారం కోసం 35 బిలియన్ డాలర్లు అవసరమవుతాయి."

- అమీనా మహమ్మద్

ఇదీ చూడండి: ప్రపంచవ్యాప్తంగా కరోనాతో రోజుకు 5 వేల మంది మృ
తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.