ETV Bharat / international

'చట్టాలను ఉల్లంఘించకుండా అఫ్గాన్​ను ఆదుకోండి' - ఐరాస అఫ్గాన్ సాయం

తాలిబన్ ప్రభుత్వానికి గుర్తింపు ఇవ్వడం, అఫ్గాన్​కు సాయం చేయడం రెండూ వేర్వేరు అంశాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘించకుండా అఫ్గాన్​కు నగదు సాయం చేయాలని కోరారు. మరోవైపు, సాయానికి అమెరికా ముందుకొచ్చిందని తాలిబన్లు ప్రకటించారు.

antonio guterres
ఆంటోనియో గుటెరస్
author img

By

Published : Oct 12, 2021, 10:55 AM IST

అఫ్గానిస్థాన్ ఆర్థిక వ్యవస్థ (Afghan Economic Crisis) కుప్పకూలకుండా అడ్డుకోవాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. విదేశాలు అఫ్గాన్​కు సాయం అందించాలని, అవసరమైన నగదును ఈ దేశంలోకి చొప్పించాలని కోరారు. అఫ్గాన్​కు సాయం విషయంలో అంతర్జాతీయ సమాజం నెమ్మదిగా అడుగులు వేస్తోందని వ్యాఖ్యానించారు. (Afghan Economy)

"ఆస్తులు స్తంభింపజేయడం వల్ల అఫ్గాన్​కు రావాల్సిన అభివృద్ధి సాయం (Afghan Economy under Taliban) ఆగిపోయింది. ఆర్థిక వ్యవస్థ దిగజారుతోంది. (Afghan Economic Crisis) బ్యాంకులు మూతబడుతున్నాయి. వైద్యం వంటి అత్యవసర సేవలు చాలా ప్రాంతాల్లో నిలిచిపోయాయి. అఫ్గాన్ ఆర్థిక వ్యవస్థలోకి నగదు చొప్పించడం.. తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించడం రెండూ వేర్వేరు అంశాలు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించకుండా అఫ్గాన్ ఆర్థిక వ్యవస్థలోకి నగదు పంపించవచ్చు. ఐరాస ఏజెన్సీలు, ఐరాస అభివృద్ధి కార్యక్రమం, ప్రభుత్వ సంస్థల ద్వారా ఈ సహాయాన్ని చేయవచ్చు."

-ఆంటోనియో గుటెరస్, ఐరాస చీఫ్

అఫ్గాన్​ ఆర్థిక వ్యవస్థలో 80 శాతం వాటా అసంఘటిత రంగానిదే అని గుటెరస్ అన్నారు. ఇందులో మహిళలదే కీలక పాత్ర అని.. వారు లేకుండా అఫ్గాన్ సమాజం, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడే అవకాశమే లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో మహిళలకు పనిచేసుకునే అవకాశం కల్పించాలని తాలిబన్లకు సూచించారు. వారికి అన్ని స్థాయిల్లో విద్యా సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ విషయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తాలిబన్లకు హితవు పలికారు.

సాయానికి అమెరికా సిద్ధం

మరోవైపు, అమెరికా తమకు మానవతా సహాయం (US helping Afghan) చేసేందుకు ముందుకొచ్చిందని తాలిబన్లు ప్రకటించారు. తాలిబన్ ప్రభుత్వానికి రాజకీయ గుర్తింపు ఇచ్చేందుకు మాత్రం నిరాకరించిందని తెలిపారు. బలగాల ఉపసంహరణ (US withdrawal from Afghanistan) తర్వాత అమెరికాతో జరిగిన చర్చల అనంతరం తాలిబన్లు ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ సమావేశంపై అమెరికా అధికారిక ప్రకటన చేసినప్పటికీ.. పెద్దగా వివరాలు వెల్లడించలేదు. తాలిబన్లకు గుర్తింపు ఇచ్చే విషయంపై చర్చలు చేపట్టడం లేదని సమావేశానికి ముందే అమెరికా స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.