ETV Bharat / international

'కరోనా కారణంగా పెరిగిన లైంగిక హింస' - లైంగిక హింసపై ఐరాస నివేదిక

కొవిడ్​ మహమ్మారి వ్యాప్తి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో లైంగిక హింస పెరిగిందని ఐరాస తెలిపింది. చాలా దేశాల్లో రాజకీయ అణచివేత చోటుచేసుకుందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ పేర్కొన్నారు. బాధితులను ఆదుకోవాలంటూ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు.

antonio guteruss
ఆంటోనియో గుటెరస్​
author img

By

Published : Apr 14, 2021, 7:35 AM IST

కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది పలు దేశాల్లో లైంగిక హింస పెచ్చరిల్లిందని.. సైనికులు, అతివాదులు యుద్ధ తంత్రంలో భాగంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని... చాలా దేశాల్లో రాజకీయ అణచివేత చోటుచేసుకుందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ నివేదికను విడుదల చేశారు. మొత్తం 18 దేశాల నుంచి ధ్రువీకరించిన సమాచారాన్ని ఐరాస సేకరించి, ఈ నివేదిక విశ్లేషించింది. ఐరాస భద్రతా మండలి ఎజెండాకు విరుద్ధంగా... మొత్తం 52 గ్రూపులు లైంగిక హింసకు, వేధింపులకు పాల్పడుతున్నట్టు పేర్కొంది. వీటిలో 70% పార్టీలు నిరంతరం నేరాలు చేస్తున్నట్టు వెల్లడించింది. వీటన్నింటిపైనా నిషేధం విధించినట్టు గుటెరస్‌ చెప్పారు.

"ఈ పార్టీల్లో చాలామటుకు ఉగ్రవాద సంస్థలు, ఇస్లామిక్‌ అతివాద గ్రూపులు, సైనిక, పోలీసు బలగాలతో అనుసంధానమైనవే. హింసను విడనాడేందుకు స్పష్టమైన నిర్ణయం తీసుకునేంత వరకూ మయన్మార్‌ మిలిటరీ, బోర్డర్‌ గార్డులను ఐరాస శాంతి ప్రక్రియలో భాగం కానివ్వం"

-ఆంటోనియో గుటెరస్‌,ఐరాస ప్రధాన కార్యదర్శి

కాంగో, దక్షిణ సూడాన్‌ ప్రభుత్వాలు, పోలీసు బలగాలను ఐరాస నిషేధిత జాబితాలో చేర్చింది. సిరియా ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌, సోమాలియా సైన్యం, పోలీసు విభాగాలపైనా నిషేధం విధించింది. ఈ పార్టీలు/గ్రూపులకు నిధులను నిలిపివేయాలని, వాటిపై ఆంక్షలను విధించాలని... లైంగిక హింసకు తక్షణం ముగింపు పలకాలని ఐరాస సభ్య దేశాలకు గుటెరస్‌ పిలుపునిచ్చారు. ప్రాంతీయ, అంతర్జాతీయ సంస్థలు లైంగిక హింసకు గురైనవారిని గుర్తించి, వారికి సహాయం అందించాలని కోరారు.

ఇవీ చదవండి: 'అడవి జంతువుల విక్రయాలు ఆపండి'

:9/11 నాటికి అఫ్గాన్​లో అమెరికా దళాల ఉపసంహరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.