డెమోక్రాట్ల ఈవెుయిల్స్ సమాచారాన్ని బహిర్గతం చేసిన విషయంపై వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు హిల్లరీ క్లింటన్. కేసు నమోదైనందుకైనా అసాంజే వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. భర్త బిల్ క్లింటన్‌తో కలిసి అమెరికాలో ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు హిల్లరీ.
"ఇది జర్నలిజాన్ని శిక్షించడం కాదు. మిలటరీ కంప్యూటర్ను హ్యాక్ చేసి అమెరికా సమాచారాన్ని దొంగిలించినందుకు తీసుకునే చర్య. ఈ కేసు న్యాయ విచారణ ఏ విధంగా సాగుతుందో చూడాలి. అసాంజే చేసిన దానికి ఇప్పటికైనా సమాధానం చెప్పాలి. బహుశా ట్రంప్ అమెరికాలో స్వాగతం పలకబోయే మొదటి విదేశీయుడు అసాంజేనే కావచ్చు."
-హిల్లరీ క్లింటన్.
2016లో అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రాట్ల తరఫున ట్రంప్‌కు పోటీగా బరిలో నిలిచారు హిల్లరీ. ఆ సమయంలో రష్యా నిఘా అధికారులు దొంగిలించిన డెమోక్రాట్ల ఈమెయిల్స్ సమాచారాన్ని వికీలీక్స్ బహిర్గతం చేసింది. ఇది హిల్లరీ ప్రచారంపై తీవ్ర ప్రభావం చూపింది. సమాచారాన్ని బహిర్గతం చేసినందుకు అసాంజేను అప్పటి రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ ప్రశంసించారు.
ఏడేళ్లుగా లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న అసాంజేను గురువారం లండన్ పోలీసులు అరెస్టు చేశారు. అసాంజేకు రాజకీయ ఆశ్రయాన్ని విరమించుకుంటామని ఈక్వెడార్ ప్రకటించిన వెంటనే ఈ పరిణామాలు జరిగాయి. మాజీ సైనికాధికారితో కలిసి కుట్ర పన్ని ప్రభుత్వ సమాచారాన్ని దొంగిలించారని అసాంజేపై అభియోగాలు నమోదు చేసింది అమెరికా.