కొవిడ్ వైరస్‌కు అనుబంధంగా మరో రెండు వ్యాధులు తలెత్తుతున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. అరుదైన పోస్ట్ అక్యూట్ హైపర్-ఇన్ఫ్లమేటరీ ఇల్నెస్, లేట్ ఇన్ఫ్లమేటరీ- వైరలాజికల్ సీక్వెలే వ్యాధులు ఎదురవుతున్నట్లు జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్(జేఏఎంఏ) నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
3శాతం నుంచి 67 శాతం రోగుల్లో లక్షణాలు లేని కరోనా కనిపిస్తోందని... వారిలో మరో రెండు వ్యాధులు తలెత్తే అవకాశం ఉందని పరిశోధన వెల్లడించింది. వైరల్ ప్రతిరూపకాలు, హోస్ట్ ఇమ్యూన్ రెస్పాన్స్‌తో కొవిడ్ లక్షణాలు అనుసంధానమై ఉన్నాయని పేర్కొంది.
కరోనా తగ్గాక ఈ వ్యాధులు!
కొవిడ్‌కు కారణమయ్యే సార్స్-కోవ్-2 పూర్తిగా తొలగిపోయిన తర్వాత 'హైపర్-ఇన్ఫ్లమేషన్' సంభవిస్తున్నట్లు పరిశోధన తెలిపింది. పెద్దలతో పాటు చిన్నారుల్లోనూ 'పోస్ట్ అక్యూట్ హైపర్ ఇన్ఫ్లమేటరీ ఇల్నెస్'ను గుర్తించినట్లు వెల్లడించింది. అవయవ వ్యవస్థలో ఈ సమస్య తలెత్తుతున్నట్లు పేర్కొంది. అక్యూట్ ఇన్ఫెక్షన్ వారానికి రెండు రోజుల పాటు ఉంటుందని తెలిపింది.
కవాసాకి వ్యాధి వల్ల తలెత్తే ప్రభావాలే వీటి వల్ల ఎదురవుతున్నాయని పరిశోధన తెలిపింది. హృదయనాళాలు, చర్మవ్యాధులు, శ్లేష్మ, జీర్ణశయాంతర పేగు సమస్యలు తలెత్తుతున్నట్లు వెల్లడించింది.
ఎబోలాలోనూ ఇవే..
కొవిడ్ రోగుల్లో గుర్తించిన లేట్ ఇన్ఫ్లమేటరీ, వైరలాజీకల్ సీక్వెలీ వ్యాధులు ఎబోలా, సిఫిలిస్, లైమ్ వంటి రోగాల్లోనూ కనిపించినట్లు పేర్కొంది. లేట్ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పూర్తిగా తెలియనప్పటికీ.. దీని వల్ల పలు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వివరించింది.
సార్స్-కోవ్-2 ఇన్ఫెక్షన్ వల్ల తలెత్తే వ్యాధులు, శరీరరోగ లక్షణాలు గుర్తిస్తూ సిద్ధాంతపరమైన ఫ్రేమ్‌వర్క్ రూపొందించడం ద్వారా వైరస్ పూర్వపరాలను పరిశీలించేందుకు అవకాశం లభిస్తుందని పరిశోధన బృందం పేర్కొంది. ఈ ఫ్రేమ్‌వర్క్‌ను అనుసరించి రోగి.. ఏకకాలంలో ఒకటికి మించి జబ్బులను ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపింది.