ETV Bharat / international

'అమెరికా- భారత్​ మైత్రికి ట్రంప్​ పర్యటన నిదర్శనం'

అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ పర్యటన భారత్​తో అమెరికాకు ఉన్న బలమైన బంధాన్నినిరూపిస్తోందని ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో అన్నారు. ట్రంప్​ పర్యటన వల్ల ఇరు దేశాల మధ్య మైత్రి మరింత బలపడిందన్నారు.

Trump's trip demonstrates value US places on ties with India
'అమెరికా-భారత్​ బంధానికి నిదర్శనం ట్రంప్​ పర్యటన'
author img

By

Published : Feb 28, 2020, 9:34 AM IST

Updated : Mar 2, 2020, 8:13 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ భారత్​ పర్యటనపై ఆ దేశ విదేశాంగమంత్రి మైక్​ పాంపియో స్పందించారు. ట్రంప్​ పర్యటన... భారత్​తో అమెరికాకు ఉన్న అనుబంధాన్ని నిరూపిస్తోందని తెలిపారు. ఈ వారం రోజల్లో భారత్​- అమెరికా మైత్రి ఎంతో పురోగతి సాధించిందని ట్వీట్​ చేశారు.

Trump's trip demonstrates value US places on ties with India
పాంపియో ట్వీట్​

"భారత్​లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ తొలి అధికారిక పర్యటన ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని ఎంతో బలపరిచింది. ప్రజస్వామ్య సంస్క్రతులు మమ్మల్ని ఏకం చేశాయి. ఒకే విధమైన ఆసక్తులు మా బంధాన్ని మరింత దృఢపరిచాయి. అధ్యక్షుడి నాయకత్వంలో మా భాగస్వామ్యం ఎల్లప్పుడు బలపడుతూనే ఉంటుంది."

-పాంపియో, అమెరికా విదేశాంగ కార్యదర్శి.

ఈ నెల 24,25 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్​, ఆయన సతీమణి భారత్​లో పర్యటించారు. ఇందులో భాగంగా, అహ్మదాబాద్​, సబర్మతి ఆశ్రమం, ఆగ్రా, దిల్లీని సందర్శించారు. భారత్​ పర్యటనను ఎప్పటికీ మరచిపోలేనని తెలిపారు ట్రంప్​.

ఇదీ చదవండి: టెక్​ గురూ: ఇక హైటెక్​గా పళ్లు తోముకోండి

Last Updated : Mar 2, 2020, 8:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.