అమెరికా- చైనా వాణిజ్య యుద్ధం తారస్థాయికి చేరుకుంది. ఈ అంశంలో చైనా తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఒప్పందం కుదరకపోతే డ్రాగన్ దేశం ఘోరంగా దెబ్బతింటుందని ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను హెచ్చరించారు ట్రంప్. అమెరికా సంస్థలు చైనా నుంచి వైదొలగక తప్పదని ట్వీట్ చేశారు.
-
I say openly to President Xi & all of my many friends in China that China will be hurt very badly if you don’t make a deal because companies will be forced to leave China for other countries. Too expensive to buy in China. You had a great deal, almost completed, & you backed out!
— Donald J. Trump (@realDonaldTrump) May 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">I say openly to President Xi & all of my many friends in China that China will be hurt very badly if you don’t make a deal because companies will be forced to leave China for other countries. Too expensive to buy in China. You had a great deal, almost completed, & you backed out!
— Donald J. Trump (@realDonaldTrump) May 13, 2019I say openly to President Xi & all of my many friends in China that China will be hurt very badly if you don’t make a deal because companies will be forced to leave China for other countries. Too expensive to buy in China. You had a great deal, almost completed, & you backed out!
— Donald J. Trump (@realDonaldTrump) May 13, 2019
రెండొందలుకుపైగా అమెరికా సంస్థలు చైనా నుంచి భారత్‌కు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయన్న నివేదిక నేపథ్యంలో ట్రంప్ హెచ్చరికలకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నో నెలలుగా సంప్రదింపులు జరిపి ఉత్తమమైన ఒప్పందం చేసుకునే సమయంలో చైనా వెనుకడుగు వేసిందని అగ్రరాజ్యం ఆరోపించింది.
పోటాపోటీగా సుంకాల పెంపు...
200 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై సుంకాలు పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై డ్రాగన్ దేశం దీటుగా స్పందించింది. 60 బిలియన్ డాలర్ల విలువ చేసే అమెరికా ఉత్పత్తులపై పన్నులు పెంచుతున్నట్టు ప్రకటించింది. జిన్‌పింగ్‌ను ట్రంప్ హెచ్చరించిన కొన్ని గంటలకే చైనా ఈ ప్రకటన చేసింది.
ఇదీ చూడండి: 'ప్రధాని మోదీ దేశానికి అత్యంత ప్రమాదకరం'