అమెరికా దౌత్యవేత్తలపై దాడిచేసే దిశగా పావులు కదుపుతున్నందుకే ఇరాన్ అగ్ర కమాండర్ జనరల్ ఖాసీం సులేమానీని మట్టుబెట్టామని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని అమెరికా ఎప్పుడూ ప్రయత్నించలేదని, తమకు ఆ ఉద్దేశం లేదని తాజా ప్రకటనలో ట్రంప్ పేర్కొన్నారు.
"సులేమానీ అమెరికా దౌత్యవేత్తలు, సైనిక సిబ్బందిపై దాడి చేసేందుకు కుట్ర పన్నాడు. అందుకే మేము అతన్ని మట్టుబెట్టాం."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో శుక్రవారం అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో ఇరాన్‌కు చెందిన కుర్దు దళాల కమాండర్ మరణించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఇరాన్‌తో తాను ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోవడం లేదని ట్రంప్ పేర్కొన్నారు.
"గురువారం రాత్రి మేము యుద్ధాన్ని ఆపేందుకు చర్యలు తీసుకున్నాం. యుద్ధం ప్రారంభించడానికి కాదు."
-ట్రంప్, అమెరికా అధ్యక్షుడు