ETV Bharat / international

ప్లాస్మా దానానికి సిద్ధమే అంటున్న ట్రంప్​ - Trump tests COVID positive

కరోనా చికిత్స పూర్తి చేసుకున్న అనంతరం.. తొలిసారి టెలివిజన్​కు ఇంటర్వ్యూ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. కరోనా అత్యల్ప స్థాయిలో ఉన్నా తాను ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకుంటానని పేర్కొన్నారు. వైరస్​ను నిరోధిస్తుందని భావిస్తోన్న ప్లాస్మాను ఇతరులకు దానం చేయడానికి సిద్ధమేనని స్పష్టం చేశారు.

Trump says he's no longer on medication for virus
ప్లాస్మా దానానికి సిద్ధమే అంటున్న ట్రంప్​
author img

By

Published : Oct 10, 2020, 1:22 PM IST

వాల్టర్​ రీడ్​ మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స అనంతరం తన ఆరోగ్యం చాలా బాగుందని అన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ఫాక్స్​ న్యూస్​ టెలివిజన్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.

తనకు కరోనా అత్యల్ప స్థాయిలో ఉన్నా ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకుంటానని వ్యాఖ్యానించారు ట్రంప్​. శుక్రవారం ముందు వరకూ ఎలాంటి ఔషధాలు తీసుకోలేదని స్పష్టం చేశారు. 'ఆస్పత్రికి వెళ్లే ముందు వరకు తనకు శ్వాసకోశ ఇబ్బందులు లేవని.. అయితే వైద్యులు మాత్రం ఊపిరితిత్తుల్లో ఏదో సమస్య ఉన్నట్లు గుర్తించారు' అని వెల్లడించారు. చికిత్స తర్వాత నుంచి అంతా బాగుందని వెల్లడించారు.

కరోనాపై పోరులో భాగంగా ఇతరులకు సాయం చేసేందుకు.. ప్లాస్మా దానానికి సిద్ధమేనని స్పష్టం చేశారు డొనాల్డ్​.

బహిరంగ సభ...

చికిత్స పూర్తి చేసుకున్న తర్వాత ట్రంప్‌ తొలిసారి బయటకు రానున్నారు. శ్వేతసౌధం ప్రాంగణంలో శనివారం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్​లో వెల్లడించారు. అనంతరం సోమవారం అధికారికంగా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్నట్లు ప్రకటించారు. సెంట్రల్‌ ఫ్లోరిడాలోని శాన్‌ఫోర్డ్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ట్రంప్​ ప్రసంగిస్తారు.

Trump says he's no longer on medication for virus
ప్రచార కార్యక్రమంపై ట్రంప్​ ట్వీట్​

శనివారం జరిగే కార్యక్రమంలో బాల్కనీ నుంచే ట్రంప్‌ ప్రసంగించే అవకాశం ఉందని సమాచారం. అలాగే సోమవారం జరగబోయే ప్రచార కార్యక్రమంలో ప్రతిఒక్కరి శరీర ఉష్ణోగ్రతను పరీక్షించడమే కాకుండా వారికి మాస్కులు, శానిటైజర్లు అందజేయాలని నిర్ణయించారు. కరోనా సోకడం వల్ల గత 10 రోజులుగా ట్రంప్‌ ప్రచార కార్యక్రమాలు నిలిచిపోయాయి. అయినప్పటికీ ఆయన తరఫున వారసులు ఇవాంక ట్రంప్‌, ఎరిక్‌ ట్రంప్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌, ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

'రీజెనరాన్​ వల్లే'

అక్టోబర్​ 2న డొనాల్డ్​ ట్రంప్​ దంపతులు కరోనా బారినపడ్డారు. హోం క్వారంటైన్​ అనంతరం అదే రోజు స్వల్ప లక్షణాలతో వాల్టర్​ రీడ్​ మిలిటరీ ఆస్పత్రిలో చేరారు. తనకు అందించిన ఔషధాల్లో రీజెనరాన్‌ యాంటీబాడీ డ్రగ్‌ బాగా పనిచేసిందని ట్రంప్‌ అన్నారు. దాని వల్లే కోలుకున్నానని వ్యాఖ్యానించారు. స్వర్గం నుంచి వచ్చిన బహుమతిగా ఆ మందు గురించి అభివర్ణించారు.

యాంటీబాడీ డ్రగ్ వంటి వాటితో కరోనా నుంచి కోలుకుంటారని కచ్చితంగా చెప్పలేమని అంటున్నారు వైద్య నిపుణులు. కానీ కొవిడ్​ లక్షణాలు తగ్గడం వల్ల ఆశాజనక ఫలితాలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఔషధాలు ఇంకా ప్రయోగదశలోనే ఉన్నాయని... డ్రగ్​ సురక్షితమేనా, ప్రభావవంతంగా పనిచేస్తుందా అనేది స్పష్టంగా తెలియాల్సి ఉందని వైద్యులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.