తమ గగనతలంలోకి ప్రవేశించిన అమెరికాకు చెందిన నిఘా డ్రోన్‌ను ఇరాన్ కూల్చివేయడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. డ్రోన్‌ను కూల్చి ఇరాన్ పెద్ద తప్పు చేసిందన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ట్రంప్‌నకు వెల్లడించినట్టు శ్వేతసౌధం మీడియా కార్యదర్శి సారా సాండర్స్ తెలిపారు. ఈ విషయమై చట్ట సభ్యులతో కూడా చర్చించామన్నారు.
అమెరికాకు చెందిన ఆర్‌క్యూ-4 గ్లోబల్ హాక్ నిఘా డ్రోన్ గురువారం ఉదయం హోర్మోజ్‌గాన్ ప్రావిన్స్ సమీపంలో ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించింది. రివల్యూషనరీ గార్డ్ సిబ్బంది ఆ డ్రోన్‌ను కూల్చేశారని ఇరాన్ అధికారిక టీవీ ఛానల్ పేర్కొంది. ఈ వార్తలను అమెరికా కూడా ధ్రువీకరించింది.
చమురు ధరలకు రెక్కలు
ఇరాన్‌పై ట్రంప్ ఆగ్రహంతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు సుమారు 6 శాతానికి పైగా పెరిగాయి. యూరప్ బ్రెంట్ ముడి చమురు ధర సుమారుగా 5 శాతం మేర పెరిగింది. ముడి చమురు సరఫరా చేసే ప్రధాన జలసంధి హొర్మూజ్ వద్ద డ్రోన్ కూల్చటం వల్ల సరఫరాపై ప్రభావం పడుతుందని ప్రపంచ మార్కెట్లలో భయాలుపట్టుకున్నాయి.
ఇదీ చూడండి: అమెరికా నిఘా డ్రోన్‌ను కూల్చేశాం: ఇరాన్