అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిష్ఠాత్మక 'లిజియన్ ఆఫ్ మెరిట్' అవార్డును అందించారు. భారత్-అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతానికి కృషి చేయడం సహా భారత్ ప్రపంచ శక్తిగా ఎదిగేలా పాటుపడుతున్నందుకు ఈ అవార్డు అందిస్తున్నట్లు ట్రంప్ సర్కారు తెలిపింది.
అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్డ్ ఓబ్రెయిన్ చేతుల మీదుగా ప్రధాని మోదీ తరఫున.. శ్వేతసౌధంలో ఈ అవార్డును స్వీకరించారు అగ్రరాజ్యంలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు.
ఈ అవార్డును రాజ్యాధినేత లేదా ప్రభుత్వాధినేతలకు మాత్రమే అందిస్తారు. మోదీకి ఈ అవార్డు రావడంపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హర్షం వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి: పాక్లో గుడి నిర్మాణానికి ఇమ్రాన్ సర్కార్ పచ్చజెండా