అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఓ ముగిసిన అధ్యయనం. మరికొన్ని రోజుల్లో జో బైడెన్.. అధ్యక్ష పదవిని అధికారికంగా చేపట్టనున్నారు. అయినప్పటికీ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. బైడెన్ గెలుపును సవాలు చేస్తూ ఇప్పటికే అగ్రరాజ్యంలోని అనేక కోర్టుల్లో పిటిషన్లు వేశారు. ఆ అస్త్రం ఫలించలేదు. తాజాగా.. ట్రంప్ ప్రయత్నానికి సంబంధించి ఓ ఆడియో టేప్ బయటకు వచ్చింది. ఇందులో జార్జియా ఎన్నికల అధికారితో ట్రంప్ సంభాషించారు. బైడెన్ విజయాన్ని రద్దు చేయాలని ఆ అధికారిని ఒత్తిడి చేశారు. అది కూడా ఫలించకపోవడం వల్ల.. తనకు అనుకూలంగా ఉన్న ఓట్లను వెతకాలని సూచించారు.
అగ్రరాజ్యంలోని ఓ ప్రముఖ వార్తా సంస్థ వాషింగ్టన్ పోస్ట్‌కు ఈ ఆడియోలోని సంభాషణను ఆన్లైన్లో పోస్ట్ చేసింది. అనంతరం ఈ ఆడియా టేప్‌ను అసోసియేటెడ్ ప్రెస్ దక్కించుకుంది.
ఈ ఘటన ఇంకా బయటపడని కొద్ది గంటల ముందు.. జార్జియా సెక్రటరీ ఆఫ్ స్టేట్, రిపబ్లికన్ బ్రాడ్ రాఫ్పెన్స్పెర్జర్తో తాను సంభాషించినట్టు ట్రంప్ తెలిపారు.
"నాకు 11,780 ఓట్లు కావాలి. ఇది మనకు వచ్చిన దాని కన్నా ఒక ఓటు మాత్రమే ఎక్కువ. ఎందుకంటే జార్జియాలో మనం విజయం సాధించాం. నాకు ఆ ఓట్లు కావాలి," అంటూ బ్రాడ్‌తో ట్రంప్ సంభాషించినట్టు ఆ టేప్‌లో రికార్డ్ అయ్యింది.
2020 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో జార్జియా నుంచి బైడెన్ 11,779 ఓట్ల తేడాతో గెలుపొందారు.
ఇదీ చూడండి:- 'కాంగ్రెస్‌లో బైడెన్ గెలుపును సవాలు చేస్తాం'