అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ప్రచార పర్వం ఊపందుకుంది. తన ప్రసంగాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ క్రమంలోనే.. ఫ్లోరిడాలో గెలవకపోతే ఆ రాష్ట్ర గవర్నర్, రిపబ్లికన్ నేత రాన్ డిసాంటిస్‌ను తొలగిస్తానని చమత్కరించారు ట్రంప్.
శుక్రవారం రాత్రి జార్జియాలోని మకోన్లో జరిగిన ప్రచార కార్యక్రమంలో ఈ మేరకు ట్రంప్ వ్యాఖ్యానించినట్లు ద హిల్ న్యూస్ వెబ్సైట్ పేర్కొంది.
" ఆయన గొప్ప పని చేశారు, నాకు మంచి స్నేహితుడు. రాన్, మనం ఈ రాష్ట్రంలో విజయం సాధించబోతున్నామా? మీకు తెలుసు ఈ రాష్ట్రంలో గెలవకపోతే, నేను గవర్నర్‌నే నిందిస్తాను. నేను ఆయన్ను ఎలాగైనా తొలగిస్తాను. అందుకోసం ఏదో ఒక మార్గాన్ని కనుక్కుంటా"
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
2016 అధ్యక్ష ఎన్నికల్లో ఫ్లోరిడాలో ట్రంప్ విజయం సాధించారు. ఎన్నికల్లో కీలకంగా ఉండే ఈ రాష్ట్రంలో 49.02 శాతం ఓట్లు ట్రంప్‌కు వచ్చాయి. డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరి క్లింటన్.. విజయానికి చేరువగా వచ్చారు. 47.82 శాతం ఓట్లు సాధించారు. ప్రస్తుతం ఫ్లోరిడాలో ముందస్తు అంచనాల ప్రకారం జో బైడెన్ కన్నా ట్రంప్ 1.4 శాతం మేర వెనకబడినట్లు తెలుస్తోంది. బైడెన్‌కు 48.2 శాతం పాయింట్స్ రాగా ట్రంప్‌కు 46.8 శాతం పాయింట్లు వచ్చాయి.
ఇదీ చూడండి: బైడెన్ గెలిస్తే అమెరికాను వదిలి వెళ్తానేమో: ట్రంప్