ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్‌తో యుద్ధాన్ని కోరుకోవటం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ యుద్ధం జరిగితే అమెరికా పూర్తి శక్తితో పోరాడుతుందన్నారు.
ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో ఈ వ్యాఖ్యలు చేశారు ట్రంప్.
"యుద్ధాన్ని మేం కోరుకోవటం లేదు. కానీ మేం బలమైన స్థానంలో ఉన్నాం. ఏదైనా జరిగితే మా బలాన్నంతా ఉపయోగిస్తాం. యుద్ధం ముగిసేందుకు ఎక్కువ సమయం కూడా పట్టదు."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
అణు ఒప్పందం నుంచి 2015లో అమెరికా వైదొలిగినప్పటి నుంచి రెండు దేశాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. అణు కార్యకలాపాలు నిలిపివేయాలని ఇరాన్‌పై అనేక ఆంక్షలను విధించింది అమెరికా. ఇటీవల హొర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికా డ్రోన్‌ను ఇరాన్ కూల్చిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
పుతిన్‌తో ట్రంప్ భేటీ
జపాన్‌లో జరగబోయే జీ-20 దేశాల సదస్సులో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ట్రంప్ భేటీ కానున్నారు. ఇరాన్, సిరియా సంక్షోభాలు, ఆయుధ నియంత్రణపై ఇరువురు నేతలు చర్చించనున్నారు.
ఇదీ చూడండి: ఇరాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది : పాంపియో