ETV Bharat / international

ట్రంప్​కు ప్రయోగాత్మక 'ఔషధం​'తో కరోనా చికిత్స

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​కు కరోనా చికిత్సలో భాగంగా అనుమతులు లేని ఔషధాన్ని అందించారు. న్యూయార్క్‌కు చెందిన రీజెనిరాన్‌ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ ఔషధం.. ప్రయోగాత్మక దశలో ఉంది. అధ్యక్షుడి వైద్యుడి విజ్ఞప్తి మేరకు సింగిల్ డోస్‌ ఇచ్చినట్లు రీజెనిరాన్‌ సంస్థ తెలిపింది.

TRUMP MEDICINE
ట్రంప్
author img

By

Published : Oct 3, 2020, 10:54 AM IST

Updated : Oct 3, 2020, 11:22 AM IST

కరోనాతో బాధపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​కు.. ప్రయోగాత్మక దశలో ఉన్న ఔషధాన్ని ఇచ్చారు. ఈ మందును న్యూయార్క్‌కు చెందిన రీజెనిరాన్‌ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసింది. అధ్యక్షుడి వైద్యుడి విజ్ఞప్తి మేరకు సింగిల్ డోస్‌ ఇచ్చినట్లు రీజెనిరాన్‌ సంస్థ తెలిపింది.

తీవ్ర అనారోగ్యాన్ని తప్పించేందుకే ఈ యాంటీబాడీ ఔషధాన్ని ఉపయోగించినట్లు తెలుస్తోంది. రీజెనిరాన్‌ సంస్థ కనిపెట్టిన ఔషధానికి ఇంకా ఎలాంటి అనుమతులు రాలేదు. ఇది ఇంకా క్లినికల్ ట్రయల్స్​లో చివరి దశలో ఉంది. కరోనాను నియంత్రించటంలో ఈ ఔషధం ఏ మేరకు పనిచేస్తుందో నిర్ధరణ కాలేదు. ట్రంప్​ను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ముందే ఈ ఔషధాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది.

ట్రంప్‌ తీసుకుంటున్న ఔషధాలివే..

కొవిడ్‌-19 నుంచి బయటపడేందుకు ట్రంప్‌ తీసుకుంటున్న ఔషధాల జాబితాను ఆయన వ్యక్తిగత వైద్యుడు డా.సీన్‌ కాన్లే వెల్లడించారు.

"అధ్యక్షుడికి వైరస్‌ సోకినట్లు పీసీఆర్‌లో నిర్ధరణ అయిన తర్వాత, ముందు జాగ్రత్తగా రెజెనెరాన్స్‌కు చెందిన 8 గ్రాముల డోసు గల పాలీక్లోనల్‌ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ తీసుకున్నారు. దీంతో పాటు జింక్‌, విటమిన్‌-డి, ఫామోనిటిడైన్‌, ఆస్పిరిన్‌, మెలటోనిన్‌ తీసుకుంటున్నారు" అని ఓ ప్రకటనలో తెలిపారు.

శుక్రవారం మధ్యాహ్నానికి కొంత అలసినట్లు కనిపించినా ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారని వెల్లడించారు. వైద్యనిపుణుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోందన్నారు. తదుపరి తీసుకోవాల్సిన అత్యుత్తమ చికిత్సా విధానాలను ఎప్పటికప్పుడు సిఫార్సు చేస్తుందన్నారు.

సైనిక ఆసుపత్రిలో..

కరోనా బారినపడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వాల్టర్‌రీడ్‌ మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైరస్ పాజిటివ్​గా తేలిన 24 గంటల తర్వాత హెలికాఫ్టర్​లో సైనిక ఆసుపత్రికి ట్రంప్‌ వెళ్లారు.

ఇదీ చూడండి: 'కరోనా' కథ మార్చేనా..! ట్రంప్​కు వైరస్‌ సోకడంపై సర్వత్రా చర్చ

Last Updated : Oct 3, 2020, 11:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.