ETV Bharat / international

దయచేసి టీకా తీసుకోండి: ట్రంప్

తన మద్దతుదారులు తప్పకుండా టీకా తీసుకోవాలని కోరారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఓ న్యూస్​ ఛానల్​ ఇచ్చిన ఇంటర్యూలో టీకా సురక్షితమైనదే అని పేర్కొన్నారు.

Trump encourages supporters to get vaccinated against COVID-19
దయచేసి టీకా తీసుకోండి: ట్రంప్
author img

By

Published : Mar 17, 2021, 10:43 AM IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన మద్దతుదారులను కొవిడ్ టీకా తీసుకోవాలని కోరారు. వ్యాక్సిన్​ తీసుకునేందుకు ఎక్కువ మంది రిపబ్లికన్లు విముఖత చూపుతున్న నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

"అందరూ కొవిడ్ టీకా తీసుకోవాలని నేను కోరుతున్నా. ముఖ్యంగా ఎన్నికల్లో నాకు ఓట్లు వేసిన వారు తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోండి. ఇది చాలా మంచి టీకా. సురక్షితమైంది. సమర్థంగా పనిచేస్తుంది కూడా."

-డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు.

ఓ న్యూస్​ ఛానల్​కు ఇంటర్యూ ఇచ్చిన ట్రంప్... అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ-ఎఫ్​డీఏ, ఫార్మా సంస్థలు కొవిడ్​ టీకాను అభివృద్ధి చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నాయని అన్నారు. చమురు ధరల పెంపు, సరిహద్దుల అంశానికి సంబంధించి అధ్యక్షుడు జో బైడెన్​పై విమర్శలు గుప్పించారు. ​

డొనాల్డ్​ ట్రంప్​ మద్దతుదారుల్లో 47 శాతం మంది టీకా తీసుకునేందుకు నిరాకరిస్తున్నట్లు ఇటీవలే ఓ సర్వేలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

ఇదీ చదవండి:అంచనాలు లేకుండానే అమెరికా-చైనా చర్చలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.