ETV Bharat / international

క్యాపిటల్​లో 'హింస'ను ఖండించిన ట్రంప్​ - Trump supporters

అందరు అమెరికన్లలాగే తాను కూడా క్యాపిటల్​ భవనం వద్ద జరిగిన హింసతో ఆగ్రహానికి గురైనట్టు అధ్యక్షుడు ట్రంప్​ తెలిపారు. అమెరికా ఎప్పుడూ శాంతిభద్రతలకు కట్టుబడి ఉంటుందన్నారు. మరోవైపు అధికార బదిలీకి సహకరిస్తానని స్పష్టం చేశారు.

Trump condemns Capitol riot, concedes to Biden
'క్యాపిటల్​ భవనంలో జరిగిన దాడి 'క్రూరమైన చర్య"
author img

By

Published : Jan 8, 2021, 7:42 AM IST

Updated : Jan 8, 2021, 8:21 AM IST

అమెరికా క్యాపిటల్​లో జరిగిన హింసను అ దేశాధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఖండించారు. ఈ విషయంపై అందరు అమెరికన్లలాగే తానూ ఆగ్రహానికి గురైనట్టు వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

"అందరు అమెరికన్లలాగే.. జరిగిన హింసాకాండపై నేనూ ఆగ్రహానికి గురయ్యాను. క్యాపిటల్​ భవనాన్ని భద్రపరిచి, నిరసనకారులను బయటకి పంపించేందుకు తక్షణమే నేషనల్​ గార్డ్స్​ను మోహరించాను. అమెరికా ఎప్పుడూ శాంతిభద్రతలకు కట్టుబడి ఉంది. భవిష్యత్తులోనూ అలాగే ఉంటుంది."

--- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

అయితే క్యాపిటల్​ భవనంలో హింసకు పాల్పడే విధంగా తన మద్దతుదారులను ట్రంప్​ ప్రరేపించారని వస్తున్న ఆరోపణలపై మాత్రం ఆయన ఎటువంటి ప్రకటన చేయలేదు.

మరోవైపు అధికార బదిలీకి తాను సహకరిస్తానని పునరుద్ఘాటించారు ట్రంప్​. ఈ నెల 20 అధ్యక్షుడిగా జో బైడెన్​ ప్రమాణస్వీకారం చేస్తున్న నేపథ్యంలో.. పద్ధతి ప్రకారం, ఎలాంటి ఆటంకం కలగకుండా అధికార బదిలీ జరుగుతుందని పేర్కొన్నారు.

జో బైడెన్​ను అధ్యక్షుడిగా ధ్రువీకరించేందుకు బుధవారం సమావేశమైంది కాంగ్రెస్​. ఈ సమయంలో ట్రంప్​ మద్దతుదారులు వేలాది సంఖ్యలో క్యాపిటల్​ భవనానికి చేరుకుని బీభత్సం సృష్టించారు. పరిస్థితిని అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమించారు అధికారులు. ఈ నేపథ్యంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు డొనాల్డ్​ ట్రంప్​ బాధ్యత వహించాలని బైడెన్​ సహా అనేక మంది నేతలు తేల్చిచెప్పారు.

ఇదీ చూడండి: 'రాజ్యాంగంపై ట్రంప్ నిరంతర​ దాడికి పరాకాష్ఠ'

Last Updated : Jan 8, 2021, 8:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.