అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. ఆయన వైఫల్యం వల్లే అఫానిస్థాన్లో ప్రభుత్వం కూలిపోయి తాలిబన్ల రాజ్యం(Afghanistan Taliban) వచ్చిందని ఆరోపించారు. కరోనా కట్టడి సహా అనేక విషయాల్లో బైడెన్ ఘోరంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. వీటన్నింటికీ బాధ్యత వహిస్తూ ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ చట్టబద్ధంగా ఎన్నికవ్వలేదని, రాజీనామా చేయడం పెద్ద విషయమేమీ కాదని ట్రంప్ అన్నారు.
ఒక్కో రాష్ట్రాన్ని ఆక్రమిస్తూ ఆఫ్గాన్ రాజధాని కాబూల్‌ను కూడా ఆదివారం తమ వశం చేసుకున్నారు తాలిబన్లు. ఇక నుంచి దేశాన్ని తామే పాలిస్తామని ప్రకటించారు. గత్యంతరం లేక ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ.. తజికిస్థాన్ వెళ్లిపోయారు. రక్తపాతం జరగకూడదనే తాను దేశాన్ని వీడినట్లు చెప్పారు.
అప్ఘాన్ సంక్షోభంపై జో బైడెన్ ఎలా స్పందిస్తారోనని శ్వేతసౌధం సలహాదారులు చర్చించుకుంటున్నారు. మరోవైపు అఫ్గాన్ ప్రజలకు బైడెన్ నమ్మకద్రోహం చేశారని.. నిరసనకారులు శ్వేతసౌధం వద్ద ఆదివారం ఆందోళనలు చేశారు.
-
#WATCH | "Biden you betrayed us, Biden you are responsible," chanted Afghan nationals outside the White House against the US President after Afghanistan's capital Kabul fell to the Taliban pic.twitter.com/giMjt2grNW
— ANI (@ANI) August 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | "Biden you betrayed us, Biden you are responsible," chanted Afghan nationals outside the White House against the US President after Afghanistan's capital Kabul fell to the Taliban pic.twitter.com/giMjt2grNW
— ANI (@ANI) August 16, 2021#WATCH | "Biden you betrayed us, Biden you are responsible," chanted Afghan nationals outside the White House against the US President after Afghanistan's capital Kabul fell to the Taliban pic.twitter.com/giMjt2grNW
— ANI (@ANI) August 16, 2021
6 వేల మంది బలగాలు
అఫ్గానిస్థాన్‌లో తమ ప్రజలను సురక్షితంగా స్వదేశం తరలించేందుకు కాబూల్ విమానాశ్రయంలో 6,000 మంది బలగాలను మోహరించనున్నట్లు అమెరికా తెలిపింది. తమ మిత్రదేశాల ప్రజలను కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తరలించేలా చూస్తామని పేర్కొంది. ఈ విషయంపై వివిధ దేశాల విదేశాంగ మంత్రులతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ఫోన్లో మాట్లాడారు.
అఫ్గాన్‌లో ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు తాలిబన్లే బాధ్యత వహించాలని అమెరికా నేతృత్వంలో ఐరోపా సమాఖ్య సహా 60కి పైగా దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
ఇదీ చూడండి: ప్రజా పాలనకు అంతం- తాలిబన్ల కబంధ హస్తాల్లోకి అఫ్గాన్!