ETV Bharat / international

'ప్లీజ్​.. నన్ను నమ్మండి.. మాస్క్​ వేసుకున్నా'

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మాస్క్​ వేసుకోవడం ఎప్పుడైనా చూశారా? సమస్యే లేదు, ఆయన ఇంతవరకు మాస్క్​ ధరించిన సందర్భమే లేదు అంటారా? అయితే ట్రంప్​ తానే స్వయంగా మాస్క్​ ధరించినట్లు ఒప్పుకున్నారు. కానీ అది చూసే భాగ్యం మాత్రం లేదట!

Trump appears without mask at Ford plant despite policy
'ప్లీజ్​.. నన్ను నమ్మండి.. నేను మాస్క్​ వేసుకున్నా'
author img

By

Published : May 22, 2020, 4:12 PM IST

గుమ్మం దాటితే చాలు.. ఎక్కడ చూసినా మాస్క్​లు ధరించిన ముఖాలే దర్శనమిస్తున్నాయి. మాస్క్​ లేకపోతే కనీసం జేబు రుమాలైనా కట్టుకుని తిరుగుతున్నారు. ఇంతలో ఎంత మార్పు.. ఏం తంటా తెచ్చిపెట్టావే కరోనా! అనుకుంటున్నారంతా.

కానీ కరోనా నుంచి కూడా ఆయనకు మినహాయింపు ఉంది. ఆయనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. 'మాస్కా.. నేను ధరించను. నాకవసరం లేదు..' అని ఇప్పటికే పలుమార్లు తెగేసి చెప్పారు ఆయన​. కానీ ట్రంప్​ మాస్క్​ ధరిస్తే చూద్దామని ప్రజలు... క్లిక్​ మనిపించి చూపిద్దామని విలేకర్లు ఆయన వెనుక తిరుగుతూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఆ దృశ్యం కనపడిందే లేదు.

అయితే ట్రంప్​ తానే స్వయంగా మాస్క్​ ధరించానని ఒప్పుకున్నారు. గురువారం మిషిగాన్​ రాష్ట్రంలోని ఫోర్డ్​ కర్మాగారాన్ని సందర్శించారు ట్రంప్​. అనంతరం అక్కడి విలేకర్లతో మాట్లాడారు. ఆ సమయంలో విలేకర్లు మాస్క్​ వేసుకున్నారా? అని అడగ్గా.. ట్రంప్​ తనదైన రీతిలో సమాధానమిచ్చారు.

'ప్లీజ్​.. నన్ను నమ్మండి.. నేను మాస్క్​ వేసుకున్నా'

రిపోర్టర్​: మీరు మాస్క్​ వేసుకోకూడదని ఎందుకు నిర్ణయించుకున్నారు?

ట్రంప్​: నేను ఇంతకుముందే మాస్క్​ వేసుకున్నాను. కర్మాగారాన్ని చూడటానికి వెళ్లినప్పుడు ధరించాను. కానీ అది చూసే భాగ్యాన్ని మీడియాకు ఇవ్వను.

రిపోర్టర్​: మీరు గాగుల్స్​ కూడా ధరించారా?

ట్రంప్​: అవును.. గాగుల్స్​, మాస్క్​ రెండూ ధరించాను. ఇక్కడ పెట్టుకోలేదు అంతే.

రిపోర్టర్​: ఇక్కడ మాత్రం ఎందుకు పెట్టుకోలేదు?

ట్రంప్​: అవసరం లేదు. ఇక్కడ అందరికీ పరీక్షలు జరిగాయి. నాకు జరిగాయి. నిజానికి.. నాకు ఉదయం కూడా కరోనా పరీక్ష చేశారు. కనుక మాస్క్​ అవసరం లేదు. ధరించాలి అనుకునే వాళ్లు ధరించొచ్చు. అది వారి ఇష్టం. నేను లోపలకు వెళ్లినప్పుడు మాస్క్​ పెట్టుకున్నా. చూడటానికి చాలా బాగుంది. ఇక్కడ అవసరం లేదు అని వాళ్లే అన్నారు.

రిపోర్టర్​: ఇలా చేయడం వల్ల అమెరికన్లకు ఏం సందేశం వెళ్తుంది?

ట్రంప్​: ఇది రెండు విధాలుగా వెళ్తుంది. వాళ్లు చెప్పారు. నేను మాస్క్​ ధరించాను. ధన్యవాదాలు.

వెంటిలేటర్లు తయారు చేసే ఈ కర్మాగారం పర్యటనకు ట్రంప్ వచ్చినప్పుడు మాస్క్​ ధరించి తీరాలని ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయాధికారి ముందే చెప్పారు. లేకుంటే మరోసారి ట్రంప్​ తమ రాష్ట్రానికి రాకుండా నిషేధం విధిస్తామని హెచ్చరించారు. అయినప్పటికీ ట్రంప్​ మాస్క్​ లేకుండానే కర్మాగారంలో తిరిగారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.