ETV Bharat / international

ఇప్పటికీ కిమ్​తో టచ్​లో డొనాల్డ్​ ట్రంప్​! - కిమ్​ జోంగ్​ ఉన్​

Trump and Kim: ఇప్పటికీ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్​తో తాను టచ్​లో ఉన్నట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చెప్పినట్లు న్యూయార్క్​ టైమ్స్​ రిపోర్టర్ మాగీ హెబర్మన్​ వెల్లడించారు. ఆమె విడుదల చేయనున్న పుస్తకంలో ఈ విషయాన్ని పేర్కొన్నట్లు తెలిపారు.

kim jon un
కిమ్​
author img

By

Published : Feb 12, 2022, 5:18 AM IST

Trump and Kim: ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికీ టచ్‌లో ఉన్నారని ఓ పుస్తకం వెల్లడించింది. 'ది కాన్ఫిడెన్స్‌ మ్యాన్‌' పేరిట న్యూయార్క్‌ టైమ్స్‌ రిపోర్టర్‌ మాగీ హెబర్మన్‌ విడుదల చేయనున్న పుస్తకంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ విషయాన్ని ట్రంప్‌ స్వయంగా వెల్లడించినట్లు హెబర్మన్‌ పేర్కొన్నారు. వీటిల్లో వాస్తవమెంతో తనకు తెలియదని ఆమె పేర్కొన్నారు. ఓ పక్క వరుస క్షిపణి పరీక్షలతో అమెరికా-ఉత్తర కొరియా మధ్య ఉద్రిక్త వాతావరణం ఉన్న సమయంలో ఈ అంశం వెలుగులోకి రావడం విశేషం. 2018లో కిమ్‌-ట్రంప్ మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు జరిగాయి.

ఈ అంశంపై స్పందించేందుకు అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ నిరాకరించింది. మరోవైపు శ్వేత సౌధం కూడా స్పందించలేదు. అక్కడి '1799 లోగన్‌ చట్టం' ప్రకారం అమెరికా ప్రజలు ప్రభుత్వ గుర్తింపు లేకుండా విదేశీ ప్రభుత్వాలతో చర్చలు జరపడంపై నిషేధం ఉంది. దీనిపై ఉత్తరకొరియాకు సంబంధించిన 'ప్రాజెక్టు 38' డైరెక్టర్‌ జెన్నీ టౌన్‌ స్పందించారు. ట్రంప్‌ ప్రతి విషయాన్ని ఎక్కువగా చెప్పుకొంటారని.. కేవలం గ్రీటింగ్స్‌ వంటివి ఏమైనా పంపి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. కానీ, శ్వేత సౌధం అనుమతి లేకుండా అంతకు మించి ఏం జరిగినా.. అమెరికాకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వెల్లడించారు.

కిమ్‌తో సంప్రదింపులు జరిపిన అంశాలకు సంబంధించిన 15 బాక్సుల నిండా రికార్డులను గత నెల అమెరికా ప్రభుత్వం స్వాధీనం చేసుకొంది. ట్రంప్‌ వీటిని ఫ్లోరిడాలోని తన నివాసంలో ఉంచగా అధకారులు స్వాధీనం చేసుకొన్నారు. వీటిల్లో చాలా వరకు అత్యంత రహస్య పత్రాలు కావడం విశేషం.

ఇదీ చూడండి : 'మీటూ' బిల్లుకు అమెరికా​ కాంగ్రెస్ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.