ఆగస్టు 31నాటికి అమెరికా బలగాలు అఫ్గాన్‌ను వీడినప్పటికీ.. తమ సైనిక సిబ్బంది అక్కడే ఉంటారని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో(Canadian Prime Minister Justin Trudeau) ప్రకటించారు. అఫ్గాన్ వీడివెళ్లేందుకు ప్రజలకు అనుమతిచ్చేలా తాలిబన్లపై(Taliban Afghanistan) తాము ఒత్తిడి తెచ్చే ప్రక్రియను కొనసాగిస్తామని చెప్పారు.
"ప్రస్తుత సంక్షోభ సమయంలో అఫ్గాన్‌పై మా నిర్ణయాన్ని మార్చుకోలేము. అమెరికా బలగాల ఉపసంహరణకు గడువు పూర్తైనప్పటికీ..మా సైన్యం అక్కడే ఉంటుంది. ప్రజలను అఫ్గాన్ నుంచి తరలించేందుకు సహకరించాల్సిందిగా తాలిబన్లపై ఒత్తిడి తేవడాన్ని మేం కొనసాగిస్తాం."
-జస్టిన్ ట్రూడో, కెనడా ప్రధానమంత్రి.
తమ మిత్రదేశాలతో పాటు సాధ్యమైనంత మేర ఎక్కువ మందిని అఫ్గాన్ నుంచి బయటకు తీసుకువచ్చేందుకు తాము ప్రతిరోజు కృషి చేస్తామని జస్టిన్‌ట్రూడో తెలిపారు. "అఫ్గాన్‌పై జీ-7 దేశాలు తీసుకున్న నిర్ణయం స్పష్టమైనది. మేమంతా కలిసి ప్రజలను కాపాడేందుకు ప్రయత్నిస్తాం." అని చెప్పారు.
మంగళవారం జీ7 కూటమి దేశాధినేతల(G7 leaders meeting on Afghanistan) సమావేశం అనంతరం ట్రూడో ఈ వ్యాఖ్యలు చేశారు. అఫ్గాన్ పరిస్థితిని చర్చించేందుకు అత్యవసర వర్చువల్ సమావేశం నిర్వహించేందుకు బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పిలుపునివ్వగా ఈ భేటీ జరిగింది. అఫ్గాన్‌లో చిక్కుకుపోయిన విదేశీయులను, తమకు సహకరించిన వారిని సురక్షితంగా అక్కడి నుంచి తీసుకురావడమే తమ ప్రాధాన్యమని జీ7 దేశాధినేతలు తమ భేటీ అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
అంతకుముందు, తాలిబన్లు ఉగ్రవాదులని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తేల్చి చెప్పారు. వారిని తాము అలానే గుర్తిస్తామన్నారు. తాలిబన్లపై ఆర్థిక ఆంక్షలకు తాను అనుకూలమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు.. తమ సైనిక విమానాల ద్వారా సోమవారం 500 మందిని తరిలించామని కెనడా రక్షణ శాఖ మంత్రి హర్జిస్ సాజన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
ఇదీ చూడండి: Biden Afghanistan: 'తరలింపు ప్రక్రియ ఆగస్టు 31లోగా పూర్తి చేసేస్తాం'
ఇదీ చూడండి: Zarifa Ghafari: 'తాలిబన్ నేతలతో చర్చకు సిద్ధం'