ETV Bharat / international

టిక్​టాక్​ నిషేధంపై ఉద్యోగుల న్యాయపోరాటం!

author img

By

Published : Aug 14, 2020, 10:53 AM IST

అమెరికాలో టిక్​టాక్​ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్ ప్రభుత్వంపై ఆ సంస్థతోపాటు ఉద్యోగులు న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి వేర్వేరు పిటిషన్లను దాఖలు చేయనున్నట్లు సమాచారం.

TikTok
టిక్​టాక్​

అమెరికాలో ప్రముఖ వీడియో యాప్‌ టిక్​టాక్​ నిషేధం ఉత్తర్వులపై సంస్థతోపాటు ఉద్యోగులూ కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పిటిషన్​ రూపొందిస్తున్న న్యాయవాది మైక్​ గాడ్విన్​ ఈ విషయాలను వెల్లడించారు.

టిక్​టాక్​ కంపెనీ, ఉద్యోగులు వేర్వేరుగా పిటిషన్​ దాఖలు చేయనున్నట్లు స్పష్టం చేశారు గాడ్విన్. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని వాదించనున్నట్లు తెలిపారు.

ప్రమాదంలో ఉద్యోగుల జీవితాలు..

అయితే అమెరికాలోని 1,500 మంది ఉద్యోగులకు టిక్​టాక్​ జీతాలు చెల్లించటం చట్ట విరుద్ధమవుతుందా అనే అంశంపై స్పష్టత లేదు. అందుకే టిక్​టాక్​ ఉద్యోగులు న్యాయవాదిని ఆశ్రయించారు. ట్రంప్ ఆదేశాల ప్రకారం టిక్​టాక్​, దాని మాతృసంస్థ బైట్​డాన్స్​ చేసే ప్రతి లావాదేవీకి నిషేధం వర్తిస్తుంది.

ప్రస్తుతం టిక్​టాక్​ ఉద్యోగుల జీవనోపాధి, జీతాలు ప్రమాదంలో పడ్డాయని గాడ్విన్ తెలిపారు. కార్మికుల హక్కులపైనే ఉద్యోగులు న్యాయపోరాటం చేస్తారని, ట్రంప్ పేర్కొన్న జాతీయ భద్రతపై కాదని స్పష్టం చేశారు.

వారి హక్కులను గౌరవిస్తాం..

ఉద్యోగుల పిటిషన్​తో తమకు సంబంధం లేదని టిక్​టాక్ తెలిపింది. కానీ, సంఘటితంగా పోరాడే వారి హక్కులను గౌరవిస్తామని స్పష్టం చేసింది. ట్రంప్ నిషేధం బెదిరింపుల నేపథ్యంలో టిక్​టాక్​ను బలవంతంగా దక్కించుకునేందుకు మైక్రోసాఫ్ట్ ప్రయత్నిస్తోందని ఆరోపించింది సంస్థ.

భద్రతపై హామీ ఇస్తేనే..

టిక్​టాక్​ కొనుగోలు చేసే ఏ అమెరికన్​ సంస్థ అయినా పూర్తి భద్రతపై హామీ ఇవ్వాలని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికాకు గణనీయమైన లాభం చేకూర్చితేనే అందుకు సమ్మతిస్తామని తెలిపారు. అమెరికా సంస్థలతో టిక్​టాక్​ ఒప్పందానికి సెప్టెంబర్​ 15 తుది గడువుగా ట్రంప్ నొక్కిచెప్పారు.

యాప్​పై నిషేధం..

చైనా ఆధారిత యాప్​లైన టిక్​టాక్, వీచాట్​ను దేశంలో నిషేధిస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. జాతీయ భద్రత, విదేశాంగ విధానం, ఆర్థిక వ్యవస్థలకు వీటి ద్వారా ప్రమాదం ఉన్న కారణంగా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సెప్టెంబర్​ నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది.

టిక్​టాక్​, వీచాట్​పై నిషేధాన్ని శ్వేతసౌధ మీడియా కార్యదర్శి కేలీ మెక్​ఎనానీ సమర్థించారు. 1977 చట్టం ప్రకారం అంతర్జాతీయ ఆర్థిక ప్రమాదాలపై నిర్ణయం తీసుకునే అత్యవసర అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. ఈ యాప్​లు వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయన్నారు. సైబర్ దాడుల నుంచి అమెరికన్లను కాపాడేందుకు ట్రంప్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

ఇదీ చూడండి: 'టిక్​టాక్'​పై నిషేధానికి ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.