ETV Bharat / international

అద్భుతం.. ఈ ఫేస్​ పెయింటింగ్​ మాయ! - మేకప్ వైరల్ వీడియో

ఆప్టికల్​ ఇల్ల్యూషన్ ఫేస్​ ఆర్ట్​​ను వేరే లెవెల్​కు తీసుకెళ్లింది మిమి చోయ్ అనే మేకప్ ఆర్టిస్ట్. ప్రతీ పెయింటింగ్​లో వైవిధ్యాన్ని చూపిస్తూ.. ఎన్నో రకాల భ్రమలను కలిగిస్తోంది.

optical illusion makeup
ఆప్టికల్​ ఇల్ల్యూషన్ మేకప్
author img

By

Published : Jul 18, 2021, 12:00 PM IST

'ద్యా..వు..డా..!'... ఈ అమ్మాయి పెయింటింగ్స్​ చూస్తే ఎవ్వరైనా ఇలా కంగుతినాల్సిందే. ఎందుకంటే 'ఒక్కో సీను ఒక్కో షాటు.. మైండ్ పోతుంది లోపల' అన్నట్లు.. ఒక్కొక్క పెయింటింగ్ చూస్తే ఆశ్చర్యంతో నోరేళ్లబెట్టడం ఖాయం. అంతలా అబ్బురపరుస్తోంది మిమి చోయ్ అనే ఫ్రొఫెషనల్ మేకప్​ ఆర్టిస్ట్​. ' ఏంటీ.. అంత సీను ఉందా?' అంటే.. 'అంత కన్నా ఎక్కువే ఉంది!' అని నిరూపిస్తోంది.

మేకప్​లో ఎన్నో రకాలున్నాయి. అందులో ఒకటి ఆప్టికల్​ ఇల్ల్యూషన్. భ్రమ కల్పించేవి. అందులో తన వైవిధ్యంతో వీక్షకులను మంత్ర ముగ్ధుల్ని, కొన్నిసార్లు ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది కెనడాలోని వాంకోవర్​కు చెందిన మిమి చోయ్.

ఆమె ముఖమే కాన్వాస్​గా మార్చి.. చిత్రవిచిత్రమైన ప్రయోగాలతో ఎన్నోసార్లు ఔరా అనిపిస్తే.. ఇంకొన్ని సార్లు.. అర్ధంకాని ఆశ్చర్యాలకు గురిచేస్తోంది. మొత్తానికి భలే పెయింటింగ్​ అనిపిస్తుంది.

ఇదీ చూడండి: మెగా లేడీస్​ 'నో మేకప్'​ లుక్స్​ వైరల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.