అమెరికాలో ప్రతి సంవత్సరం జరిగే డాగ్ షో ఎలాంటి ఆడంబరాలు లేకుండానే ప్రారంభమైంది. 145ఏళ్ల చరిత్రలో మొట్టమొదటి సారి న్యూయార్క్‌లోని రివర్ ఫ్రంట్ ఎస్టేట్ గ్రౌండ్లో ఈ (The Westminster Kennel Club dog show) పోటీలు జరుగుతున్నాయి. కరోనా కారణంగానే ఈ మార్పులు జరిగినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఫిబ్రవరిలోనే జరగాల్సిన ఈ షో.. కరోనా కారణంగా వాయిదా పడి ఇప్పుడు ప్రారంభమైంది.
టార్రీ టౌన్, లిండ్రస్ట్ ఎస్టేట్‌లో గ్రీన్ కార్పెట్‌పై శునకాలు పోటీల్లో పాల్గొన్నాయి. 145 ఏళ్ల నుంచి సంప్రదాయంగా జరుగుతున్న ఈ షోని ఆదివారం నుంచి ఫాక్స్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
"ఈ శునకం పేరు షంబూ. ఈరోజు ఇది చాలా బాగా పరిగెత్తింది. ఈ దేశంలోనే అత్యంత చురుకైన శునకం ఇదే. 29 ఛాంపియన్ షిప్‌లను గెలుచుకుంది. దీని వయస్సు 9 సంవత్సరాల 6నెలలు."
-తోర్పే, షంబూ యజమాని
"వైపర్(శునకం) రెండు సంవత్సరాలుగా పోటీలో పాల్గొనలేదు. కరోనా వల్ల మేమే ఒక సంవత్సరం పోటీకి తీసుకెళ్లలేదు. అయినా.. అన్నీ నేర్చుకుంది. ఇప్పుడు పోటీలో వైపర్ పాల్గొంటుంది."
-కోలీ, వైపర్ యజమాని
అయితే కరోనా కారణంగా ప్రేక్షకులకు అనుమతి లేదు. శునకాల యజమానులు టీకా వేసుకుని ఉంటేనే అనుమతినిస్తారు. గతేడాది 545AKC స్యాన్షన్డ్ డాగ్ షోలు దేశవ్యాప్తంగా నిర్వహించారు.
ఇదీ చదవండి: అంబులెన్సు వెంట శునకం పరుగులు- వీడియో వైరల్