ఉత్తరాఖండ్‌లో ధౌలీగంగా జల ప్రళయం మిగిల్చన మహా విషాధంపై ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ విచారం వ్యక్తం చేశారు.
వరద బీభత్సంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. జలప్రళయంలో చాలమంది గల్లంతవడం బాధాకరమన్నారు. ఈ సమయంలో భారత్‌కు అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు.
ఇప్పటివరకు 14 మృతదేహాలు సహాయక బృందాలు వెలికితీశాయి. 15 మందిని సురక్షితంగా కాపాడినట్లు చమోలీ పోలీసుల వెల్లడించారు. జల విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న 170 మంది కార్మికులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరు పోలీసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: దేవభూమిలో ప్రళయం- 170 మంది గల్లంతు!