ETV Bharat / international

పెట్రోల్​ బంక్​ వద్ద కాల్పులు- ముగ్గురు మృతి

Texas Shooting: పెట్రోల్​ బంక్​ వద్ద ఉన్న దుకాణంలోకి ప్రవేశించిన ఓ దుండగుడు అకస్మాత్తుగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్​ రాష్ట్రంలో జరిగింది.

shooting
పెట్రోల్​ బంక్​ వద్ద కాల్పులు- ముగ్గురు మృతి
author img

By

Published : Dec 28, 2021, 3:47 AM IST

Updated : Dec 28, 2021, 5:16 AM IST

Texas Shooting: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. టెక్సాస్​లోని డాలస్​ సమీపాన ఉన్న గార్లాండ్​ అనే పట్టణంలో ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

ఇదీ జరిగింది..

ఆదివారం రాత్రి (స్థానిక కాలమానం ప్రకారం) గార్లాండ్​లోని పెట్రోల్​ బంక్​ వద్ద ఉన్న దుకాణంలోని నిందితుడు ప్రవేశించి కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం ట్రక్కులో పరారయ్యాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన మరొకరిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఇదీ చూడండి : ఒమిక్రాన్​కు చెక్​ పెట్టేందుకు నాలుగో డోసు- ఆ దేశంలో ట్రయల్స్​

Last Updated : Dec 28, 2021, 5:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.