ETV Bharat / international

కరోనాపై దేశాల స్పందనకు.. అవినీతికి లింకు అదెలా?

కరోనా మహమ్మారిపై దేశాలు స్పందించిన తీరుకు.. అవినీతికి లింకు ఉందంటోంది ఓ సర్వే. వైద్య, ఆరోగ్య రంగాల్లో భారీగా నిధులు సమకూర్చిన దేశాల్లో కరోనా కట్టడి సాధ్యమైనట్లు తెలిపింది. అవినీతిపై అంచనాల్లో ఏ దేశం ఏ స్థానంలో ఉందో చూద్దాం.

survey,
కరోనాను నియంత్రించ లేకపోవడానికి అదే కారణం!
author img

By

Published : Jan 28, 2021, 3:32 PM IST

యావత్​ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేసింది. ఈ వైరస్​ను నియంత్రించటంలో ఎన్నో దేశాలు విఫలమయ్యాయి. ఇందుకు అవినీతికి స్థానం ఉందని చెబుతోంది ఓ సర్వే. ఆయా దేశాల్లో అవినీతి బట్టే కరోనాపై స్పందన ఉందని పేర్కొంది.

అవినీతి అత్యల్పంగా ఉన్న దేశాలు కరోనా మహమ్మారితో ఎదురైన ఆర్థిక, వైద్య రంగ సవాళ్లను ఎదుర్కోవటంలో సఫలమైనట్లు పేర్కొంది అవినీతి వ్యతిరేక సంస్థ ట్రాన్పరెన్సీ ఇంటర్నేషనల్. 'కరప్షన్​ పర్సెప్షన్​ ఇండెక్స్- 2020' పేరిట నివేదిక విడుదల చేసింది. వివిధ రంగాల నిపుణులు, వ్యాపారవేత్తల సహకారంతో వివిధ దేశాల్లో అవినీతిపై సర్వే చేపట్టింది.

ప్రతి దేశానికి ఈ సంస్థ 0-100 మధ్య పాయింట్లను కేటాయించింది. 100 వస్తే అవినీతి రహిత దేశంగా, 0 వస్తే అవినీతిలో కూరుకుపోయిన దేశంగా పరిగణించింది.

" కొవిడ్​-19 అనేది కేవలం ఆరోగ్య, ఆర్థిక సంక్షోభం మాత్రమే కాదు. అది అవినీతి సంక్షోభం. దానిని సరిగ్గా నిర్వహించటంలో విఫలమయ్యాం. ప్రపంచవ్యాప్తంగా అవినీతికి, కరోనా వైరస్​పై స్పందనకు పెద్ద ఎత్తున సంబంధం ఉందని తేలింది. వైద్య సామగ్రి కొనుగోలుకు అవినీతి ప్రతిబంధకంగా మారింది "

- డేలియా ఫెర్రేయ్​రా రుబియో, సర్వే అధినేత.

మరింత దిగజారిన అమెరికా..

అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో ఉండే అమెరికాలో అవినీతి సూచీలో ఏటా తన స్థానాన్ని దిగజార్చుకుంటోంది. ఈ ఏడాది అమెరికాకు నూటికి 67 పాయింట్లు మాత్రమే దక్కాయి. ఈ సంఖ్య 2019లో 69, 2018లో 71, 2017లో 75గా ఉంది. ఈ ఏడాది అవినీతి సూచిలో చిలీతో సమానంగా 25వ స్థానంలో నిలిచింది. అమెరికాకు పాయింట్లు తగ్గడానికి ప్రధాన కారణం 2020లో ఆ దేశం ప్రకటించిన కొవిడ్​ రిలీఫ్​ ప్యాకేజీ అని సర్వే పేర్కొంది. కేవలం 1 ట్రిలియన్​ డాలర్లు ప్రకటించడం పట్ల ప్రభుత్వ జవాబుదారీతనంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయని తెలిపింది.

ఉరుగ్వే 21..బంగ్లాదేశ్​ 146

ఉరుగ్వేకు ఏకంగా 71 పాయింట్లు వచ్చాయి. అవినీతి ఇండెక్స్​లో 21వ స్థానంలో నిలిచింది. ఆరోగ్య రంగంలో భారీగా నిధులు కేటాయించటం వల్ల కరోనాతో పాటు జికా వైరస్​, యెల్లో ఫీవర్​ వంటి వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలిగిందని సర్వే తెలిపింది.

మరోవైపు.. బంగ్లాదేశ్​కు 26 పాయింట్లే వచ్చాయి. జాబితాలో 146వ స్థానంలో నిలిచింది. కొవిడ్​-19 సమయంలో దేశంలో అవినీతి భారీగా పెరిగిపోవటం వల్ల ఆరోగ్య రంగంపై చాలా తక్కువ ఖర్చు చేశారని పేర్కొంది సర్వే. అలాగే ఆరోగ్య కేంద్రాల్లో లంచాలతో నిరుపేదలకు సాయం అందటం లేదని తెలిపింది.

తొలిస్థానంలో న్యూజిలాండ్​, డెన్​మార్క్​

న్యూజిలాండ్​, డెన్​మార్క్​ దేశాలు సూచీలో 88 పాయింట్లతో 180 దేశాల జాబితాలో అగ్రస్థానం సంపాదించాయి. అయితే న్యూజిలాండ్​లో మరింత పారదర్శకత అవసరమని తెలిపింది. ఈ రెండు దేశాలు సహా ఫిన్లాండ్​, సింగపూర్​, స్విట్జర్లాండ్, స్వీడన్​, నార్వే, నెదర్​ల్యాండ్స్, జర్మనీ, లక్సమ్​బర్గ్​ తొలి 10 స్థానాల్లో నిలిచాయి.

చివరి స్థానాల్లో ఆ రెండు దేశాలు..

చివరి స్థానాల్లో సోమాలియా, దక్షిణ సూడన్​లు నిలిచాయి. ఈ దేశాలు 12 పాయింట్లతో 179వ స్థానంలో ఉన్నాయి. వీటి కన్నా కాస్త మెరుగైన స్థానాల్లో సిరియా, యెమెన్ , వెనీజులా, సుడన్, లిబియా, ఉత్తరకొరియా మొదలైన దేశాలు నిలిచాయి. ​

2012 నుంచి ఇప్పటివరకు 26 దేశాలు తమ స్థానాలు మెరుగుపరుచుకోగా, 22 దేశాలు తమ స్థానాలను దిగజార్చుకున్నాయి.

ఇదీ సంగతి : 'ముంబయిని కేంద్రపాలిత ప్రాంతం చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.