ETV Bharat / international

కరోనా చేసిన మేలు అదొక్కటే... కానీ...

లాక్​డౌన్​ వల్ల ప్రపంచవ్యాప్తంగా కాలుష్య తీవ్రత భారీగా తగ్గింది. అన్ని దేశాల్లో కలిపి ఏప్రిల్​లో 17 శాతం కర్బన ఉద్గారాలు తగ్గాయి. ఇలాగే కొనసాగితే ఏడాది మొత్తంగా భారీగా కాలుష్యం తగ్గుతుందని అంచనావేశారు. అయితే వాతావరణ మార్పులపై దీని ప్రభావం అంతంతమాత్రమేనని స్పష్టం చేశారు.

VIRUS-US-WORLD-POLLUTION
కరోనాతో తగ్గిన కాలుష్యం
author img

By

Published : May 20, 2020, 4:01 PM IST

కరోనా లాక్​డౌన్​తో ప్రపంచవ్యాప్తంగా కర్బన ఆధారిత కాలుష్యం భారీగా తగ్గినట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. ఏప్రిల్​లో పూర్తి స్థాయి లాక్​డౌన్​ ఉన్న కారణంగా.. అత్యధికంగా 17 శాతం కర్బన ఉద్గారాలు తగ్గినట్లు గుర్తించారు పరిశోధకులు.

గరిష్ఠంగా 7 శాతం..

కరోనాతో ప్రపంచమంతా ఇళ్లకే పరిమితమైన వేళ కర్బన ఉద్గారాలను అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం లెక్కించింది. 2019తో పోలిస్తే ఈ ఏడాదిలో 4 నుంచి 7 శాతం తక్కువ కాలుష్యం నమోదవుతుందని అంచనా వేసింది.

ఏడాది మొత్తం కఠిన లాక్​డౌన్​ కొనసాగితే 7 శాతం, ఆంక్షలు త్వరగా ఎత్తివేస్తే 4 శాతం తగ్గుదల ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అతిపెద్ద తగ్గుదలగా నిలుస్తుందని చెబుతున్నారు.

వివిధ దేశాల్లో..

ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏప్రిల్​4- 9 తేదీల మధ్య భారీగా కాలుష్య స్థాయి తగ్గినట్లు గుర్తించారు. రోజుకు 1.87 కోట్ల టన్నులు కర్బన ఉద్గారాలు తగ్గాయని తెలిపారు.

ఉద్గారాలను అధికంగా విడుదల చేసే దేశాల్లో చైనా మొదటిస్థానంలో ఉంది. నేచర్ క్లైమేట్ ఛేంజ్​ అనే జర్నల్​లో ప్రచురితమైన అధ్యయనం ఆధారంగా ఫిబ్రవరిలో 25 శాతం చైనాలో కర్బన కాలుష్యం తగ్గినట్లు పరిశోధకులు తేల్చారు.

భారత్​లో 26 శాతం, ఐరోపాలో 27 శాతం కర్బర ఉద్గారాలు తగ్గాయి. అమెరికాలోని కాలిఫోర్నియా, వాషింగ్టన్​లో 40 శాతానికిపైగా తక్కువ స్థాయిలో ఉద్గారాలు వెలువడ్డాయి.

మళ్లీ సాధారణ స్థితికి..

అయితే క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ఈ ప్రభావం అంతంతమాత్రమేనని పరిశోధకులు చెబుతున్నారు. మళ్లీ ఉద్గార వాయువుల స్థాయి పెరుగుతున్నట్లు గుర్తించారు. ఏప్రిల్​ 30 నుంచి రోజుకు 33 లక్షల టన్నుల ఉద్గారాలు పెరుగుతున్నట్లు స్పష్టం చేశారు.

ఇలాగే పెరిగితే గత నెలలో తగ్గిన ప్రభావం వాతావరణ మార్పులపై ఉండదని పరిశోధకులు చెబుతున్నారు.

"బకెట్​ను నీటితో నింపే సమయంలో ఒక 10 సెకన్లు కులాయి ఆపితే ఏమవుతుంది? వాతావరణ మార్పుల విషయానికి వస్తే ఈ తగ్గుదల చాలా చిన్న పరిణామం. సముద్రంలో నీటి బిందువుతో సమానం."

-కారిన్​ లీక్వెరీ, పరిశోధకురాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.