మోడెర్నా వ్యాక్సిన్ కొవిడ్ మహమ్మారి నుంచి ఆరు నెలల పాటు రక్షణ కల్పిస్తుందని నూతన అధ్యయనం వెల్లడించింది. ఫైజర్ టీకా తరహాలోనే మోడెర్నా కూడా 6 నెలల వరకు రక్షణనిస్తుందని న్యూ ఇంగ్లాండ్ మెడిసిన్ జర్నల్ నివేదిక తెలిపింది. క్లినికల్ ప్రయోగాల సమయంలో టీకా తీసుకున్న పలువురు వలంటీర్లకు మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహించగా ఈ విషయం వెల్లడైనట్లు పేర్కొంది. కరోనా కొత్త వేరియంట్‌కు ముందు ఫలితాల ఆధారంగా నివేదిక రూపొందించినట్లు తెలిపింది.
ఇదే జర్నల్‌లో ప్రచురితమైన మరో నివేదిక.. కరోనా కొత్త రకం వైరస్‌లపై ఆందోళన వ్యక్తం చేసింది. చైనాకు చెందిన సినోఫార్మ్ టీకా తీసుకున్న 50 మందిలో యాంటీబాడీలను పరీక్షించగా దక్షిణాఫ్రికా రకం వైరస్‌పై అంతగా ప్రభావం చూపలేదని పేర్కొంది. అయితే బ్రిటన్ రకం వైరస్ నుంచి టీకా రక్షణనిస్తోందని వెల్లడించింది.
ఇదీ చూడండి: 'భారత్‌లో 50వేల కరోనా మరణాల వార్త ఫేక్'