ETV Bharat / international

మాస్క్​ వేసుకోమన్న గార్డుకు 27 కత్తిపోట్లు

'మాస్క్​ ధరించండి, శానిటైజర్ వాడండి' అని చెప్పినందుకు మంగళవారం అమెరికాలోని ఓ దుకాణం సెక్యూరిటీ గార్డుపై కత్తితో దాడి చేశారు అక్కాచెల్లెళ్లు . అతి కిరాతకంగా 27 సార్లు పొడిచారు. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

FES13-US-GUARD-STABBED
మాస్క్​ ధరించండి అన్నందుకు 27సార్లు కత్తితో దాడి
author img

By

Published : Oct 28, 2020, 12:03 PM IST

కొవిడ్ -19 నిబంధనలు పాటించాలని చెప్పినందుకు ఓ దుకాణం సెక్యూరిటీ గార్డును కత్తితో 27 సార్లు పొడిచారు అక్కాచెల్లెళ్లు . ఈ ఘటన అమెరికా షికాగోలో జరిగింది. 32 ఏళ్ల బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని స్థానిక పోలీస్ అధికారి కారీ జేమ్స్​ తెలిపారు. అక్కాచెల్లెళ్లకూ స్వల్ప గాయాలు కావటం వల్ల ఆసుపత్రికి తరలించామన్నారు.

వివాదం ఇలా మొదలైంది...

షికాగోలోని ఓ షాపుకు వెళ్లిన జెస్సికా హిల్​(21), జైలా హిల్​(18)ను సెక్యూరిటీ గార్డు అడ్డుకున్నాడు. మాస్క్ ధరించి, శానిటైజ్​ చేసుకొని లోపలకు రావాలని కోరాడు. దీంతో వారి మధ్య వివాదం మొదలైంది. జెస్సికా వెనుక జేబులోంచి కత్తి తీసి దాడి చేయటం ప్రారంభించింది. జైలా సెక్యూరిటీ గార్డు జట్టు పట్టుకుని అతడు కదలకుండా చేసింది.

ఆత్మరక్షణ కోసమేనట...

జెస్సికా, జైలా ఆత్మరక్షణ కోసమే ఇలా చేశారని, వారిద్దరూ బైపోలార్ డిస్​ఆర్డర్​తో బాధపడుతున్నారని బెయిల్​పై విచారణ సందర్భంగా నిందితుల తరఫు న్యాయవాది వాదించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.