ఆకాశవీధిలో మరో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. గురువారం రాత్రి చందమామ 'స్ట్రాబెర్రీ ఫుల్ మూన్'గా కనిపించనుంది. అర్థరాత్రి 12.10 గంటలకు చంద్రుడు భూమికి అతి సమీపంగా రానున్న నేపథ్యంలో.. ఈ దృశ్యం కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే మూడు రోజుల పాటు జాబిల్లి నిండుగా దర్శనమివ్వనున్నట్లు పేర్కొన్నారు.
ఈశాన్య అమెరికాలోని ఓ తెగకు చెందిన వారి నుంచి దీనికి 'స్ట్రాబెర్రీ ఫుల్ మూన్' అనే పేరు వచ్చినట్లు నాసా పేర్కొంది. ఈ మాసంలో ఈశాన్య అమెరికా వారు.. స్ట్రాబెర్రీ పంట కోతను ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో.. స్ట్రాబెర్రీ ఫుల్ మూన్ అనే పేరు వచ్చింది.
జాబిల్లి రంగుతో ఈ పేరుకు సంబంధం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. పింక్ రంగులో మూన్ కనిపించదని స్పష్టం చేశారు.
వట పూర్ణిమ...
ఈ ఫుల్ మూన్ సమయాన్ని భారత్‌లోని హిందువులు 'వట పూర్ణిమ' పర్వదినంగా జరుపుకుంటారు. మూడు రోజుల పాటు కొత్తగా పెళ్లైన వారు తమ భర్త కోసం మర్రిచెట్టుకు తాడు కడతారు. దీన్ని పవిత్రంగా భావిస్తారు.
వసంతంలో ఏర్పడే ఫుల్ మూన్‌ను ఐరోపాలో మీడ్ మూన్, హనీ మూన్ అని పిలుస్తారు. స్ట్రాబెర్రీ ఫుల్ మూన్‌కు.. రోస్ మూన్, ఫ్లవర్ మూన్, హాట్ మూన్, హోయ్ మూన్, ప్లాంటింగ్ మూన్ అనే ఇతర పేర్లు కూడా ఉన్నాయి.
ఇదీ చదవండి:ఆకాశంలో మరో అరుదైన ఘట్టం