గానా, అమెజాన్ మ్యూజిక్, సావన్ లాంటి యాప్‌లు సంగీత ప్రియులకు వినసొంపైన సంగీతాన్ని అందిస్తున్నాయి. తాజాగా వీటికి పోటీగా మరో యాప్ వచ్చేసింది. అమెరికాలో ఇప్పటికే ప్రాచుర్యం పొందిన స్పాటిఫై భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది.
ప్రపంచవ్యాప్తంగా 200మిలియన్ల మంది వినియోగదార్లను కలిగి ఉంది స్పాటిఫై. వీరిలో 8.7 కోట్ల మంది ప్రీమియం చెల్లించి మరీ ఈ యాప్ ఉపయోగిస్తున్నట్టు సంస్థ తెలిపింది. డబ్బు చెల్లించి వినియెగించుకునే వారికి(పెయిడ్ సబ్స్క్రైబర్లు) నెలకు రూ.119గా ధర నిర్ణయించింది.
ఈ యాప్‌లో సరికొత్త ఫీచర్లతో ట్రెండ్‌కు తగ్గట్టుగా పాటలు అందుబాటులో ఉంటాయి. వివిధ భాషలలో వినియోగదారుని అభిరుచి మేరకు ప్లేలిస్ట్‌లో సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. ఆయా ప్రాంతాల ట్రెండ్బట్టి గేయాలను ఎంచుకునే వీలు కల్పించింది స్పాటిఫై.