ETV Bharat / international

ట్రంప్​ అధికారులకే మొదటగా కరోనా వ్యాక్సిన్ ! - శ్వేతసౌధంట

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు సన్నిహితంగా పనిచేసే పలువురు అధికారులు ఫైజర్ వ్యాక్సిన్​ను మొదటగా పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శ్వేతసౌధంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్​ పత్రిక తెలిపింది. అయితే వ్యాక్సిన్​ను తొలుత వైద్య సిబ్బంది, వృద్ధులకు మాత్రమే అందిస్తామని ట్రంప్​ ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది.

Some in White House getting early access to COVID-19 vaccine
ట్రంప్​ అధికారులకే మొదటగా కరోనా వ్యాక్సిన్ !
author img

By

Published : Dec 14, 2020, 8:58 AM IST

ఫైజర్​ టీకాకు ఇటీవల అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్​డీఏ) ఆమోదం తెలిపిన నేపథ్యంలో ట్రంప్​ సర్కార్​ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మొదటగా వ్యాక్సిన్​ను ట్రంప్​ అధికార వర్గంలోని పలువురు అధికారులకు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అమెరికాకు చెందిన న్యూయార్క్​ టైమ్స్​ పత్రిక తెలిపింది. అయితే వీరిలో ఎంతమందికి వ్యాక్సిన్​ను ఇవ్వనున్నారో స్పష్టత లేదని వివరించింది. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదని స్పష్టం చేసింది.

ఏదేమైనా ట్రంప్​ అధికార వర్గం శ్వేతసౌధం వీడేలోపు వారికి టీకా ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోందని తెలిపింది. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్ సైతం..తాను వ్యాక్సిన్​ను ఎప్పుడు తీసుకోవాలన్న దానిపై సన్నిహితులతో చర్చిస్తున్నట్లు సమాచారం.

ఫార్మా దిగ్గజం ఫైజర్​-బయోఎన్​టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్​కు ఇదివరకే అమెరికా నిపుణుల కమిటీ ఆమోదం తెలపగా, ఇటీవల ఎఫ్​డీఏ సైతం వ్యాక్సిన్​కు ఆమోదముద్ర వేసింది. మూడు వారాల వ్యవధిలో రెండు డోసుల చొప్పున టీకాను తీసుకోవాలని వైద్యులు నిర్ధరించారు.

ఇదీ చదవండి : ఫైజర్​ టీకాకు అమెరికా నిపుణుల కమిటీ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.