ETV Bharat / international

అమెరికాలో 200 మంది నేషనల్​ గార్డ్స్​కు కరోనా

జో బైడెన్​ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా అమెరికా క్యాపిటల్​లో విధులు నిర్వహించిన భద్రతా సిబ్బందిలో దాదాపు 200 మందికి కొవిడ్​ నిర్ధరణ అయింది. ప్రస్తుతం అక్కడ 7,000 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.

author img

By

Published : Jan 23, 2021, 10:51 AM IST

అమెరికాలో 200 మంది నేషనల్​ గార్డు సిబ్బందికి కరోనా

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్​ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో బందోబస్తు నిర్వహించిన భద్రతా బలగాల్లో కరోనా కలవరం మొదలైంది. దాదాపు 200 మంది నేషనల్​ గార్డ్స్​​ కొవిడ్​ బారినపడినట్లు తేలింది. ఈ మేరకు వాల్​స్ట్రీట్​ జర్నల్​ ఓ కథనం ప్రచురించింది.

ఇటీవల అమెరికా క్యాపిటల్​ భవనంపై దాడి నేపథ్యంలో బైడెన్​ ప్రమాణ స్వీకారానికి 26,000 మంది నేషనల్​ గార్డ్స్​​ వాషింగ్టన్​లో బందోబస్తులో పాల్గొన్నారు. వారిలో 15,000 మంది ఇప్పటికే వెనుదిరిగారు. మరో 3,600 మంది ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నారు. మరో 7,000 మంది క్యాపిటల్​ భద్రతా నిమిత్తం ​ జనవరి నెల వరకు ఉండనున్నారు.

ప్రమాణ స్వీకారం నేపథ్యంలో బందోబస్తు నిర్వహించగా.. బౌతికదూరం వంటి కనీస జాగ్రత్తలు పాటించడానికి భద్రతా సిబ్బంది పాటించలేకపోయారని తెలుస్తోంది. కరోనా కలవరంతో ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని సెనేట్​ పార్కింగ్​ గ్యారేజ్​లో బస చేయాలని ఆదేశాలు అందాయి. అయితే.. దీనిపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు రాగా.. వారిని క్యాపిటల్​కు తిరిగి ఆహ్వానించి, సమీప హోటళ్లలో వసతి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

కానుకలందించిన అమెరికా ప్రథమ మహిళ..

నేషనల్​ గార్డు దళాలకు అమెరికా ప్రథమ మహిళ జిల్​ బైడెన్​ కానుకలు అందించారు. జో బైడెన్​ ప్రమాణ స్వీకారోత్సం రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఎదురుకాకుండా కాపాడినందుకు వారికి చాకొలేట్​ చిప్​ కుకీస్​ బాస్కెట్లను అందజేశారు. బైడెన్​ కుటుంబం తరఫున వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆ కుకీస్​ను ఆమె స్వయంగా తయారు చేయడం విశేషం.

U.S. Capitol on Friday to deliver baskets of chocolate chip cookies to National Guard members
నేషనల్​ గార్డ్ సిబ్బందికి చాకొలేట్​ చిప్​ కుకీస్​ను అందజేస్తున్న అమెరికా ప్రథమ మహిళ జో బైడెన్​

తన దివంగత కుమారుడు బ్యూ కూడా ఒకప్పుడు డెలావేర్​ ఆర్మీ నేషనల్​ గార్డ్​ సభ్యుడుని జిల్​ బైడెన్​ తెలిపారు. తాను నేషనల్​ గార్డ్​ సైనికుడి తల్లినని పేర్కొన్నారు. కాగా.. అధ్యక్షుడు జో బైడెన్​ నేషనల్​ గార్డ్​ ఛీఫ్​తో స్వయంగా ఫోన్​లో మాట్లాడి ధన్యావాదాలు చెప్పారు.

ఇదీ చూడండి:ఫిబ్రవరి 8 నుంచి ట్రంప్​ అభిశంసనపై విచారణ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.