ETV Bharat / international

'నేల కుంగిపోతోంది.. జాగ్రత్త'

మానవతప్పిదాలు, ప్రకృతి వైపరిత్యాల వల్ల నేల కుంగిపోతోందని.. ఫలితంగా 63.5 కోట్ల​ మందిపై ఇది ప్రభావం చూపుతుందని ఓ అధ్యయనం హెచ్చరించింది. గత శతాబ్దంలో 34 దేశాల్లోని 200 ప్రాంతాల్లో నేల కుంగిపోయిందని పేర్కొంది.

author img

By

Published : Jan 3, 2021, 6:29 AM IST

Updated : Jan 3, 2021, 3:05 PM IST

Sinking land will affect 635M people globally: Report
'నేల కుంగిపోతోంది.. జాగ్రత్త'

భూగర్భజలాల దుర్వినియోగం వంటి మానవ కార్యకలాపాలు, ప్రకృతి వైపరిత్యాల వల్ల భూమి ఉపరితలం కుంగిపోతోందని పరిశోధకులు హెచ్చరించారు. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా 63.5 కోట్ల​ మంది ప్రభావితమవుతారని.. వీరిలో ఆసియా ప్రజలే ఎక్కువగా ఉంటారని తేల్చిచెప్పారు. రానున్న నాలుగేళ్లల్లో 9.78 మిలియన్​ డాలర్ల జీడీపీపై ఈ సమస్య ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు.

2024 నాటికి.. ప్రపంచ జనాభాలో 19శాతం(అంతర్జాతీయ జీడీపీలో 21శాతం)పై ఈ ప్రభావం ఉంటుందని సైన్స్​ జర్నల్​లో ప్రచురితమైన ఓ అధ్యయనం పేర్కొంది. గత శతాబ్దంలో.. భూగర్భజలాల క్షీణత వల్ల 34 దేశాల్లోని 200 ప్రాంతాల్లో నేల కుంగిపోయిందని పరిశోధకుల బృందం చేసిన అధ్యయనంలో తేలింది.

వరదలు, భూగర్భజలాల క్షీణత ఆధారంగా ఓ ప్రాంతంలో కుంగిపోయిన నేలకు సంబంధించిన ప్రాదేశిక, గణిత విశ్లేషణలతో ఓ మోడల్​ను రూపొందించింది పరిశోధకుడు గరార్డో హెర్రెర గార్సియా బృందం. అయితే తీవ్రతను తగ్గించేందుకు ప్రస్తుతం చేపట్టిన చర్యలను ఈ అధ్యయనంలో లెక్కకు తీసుకోలేదు.

ప్రపంచ జనాభా, ఆర్థిక వృద్ధి, కరవు, వరదలు వల్ల రానున్న దశాబ్దంలో నేల కుంగిపోయే ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం హెచ్చరించింది.

ఇదీ చూడండి:- 2020లో టాప్-20 భూగ్రహ ఫొటోలు

Last Updated : Jan 3, 2021, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.