అమెరికా పౌరసత్వ ఇమ్మిగ్రేషన్ సర్వీస్(యూఎస్సీఐఎస్)పై దాఖలు చేసిన దావాను ఏడు వ్యాపార సంస్థలతో కూడిన బృందం వెనక్కి తీసుకుంది. విదేశీ ఉద్యోగ వీసాలపై గతంలో తీసుకున్న నిర్ణయాలను మార్చేందుకు ఫెడరల్ సంస్థ అంగీకరించిన నేపథ్యంలో బృందం ఈ చర్యలు చేపట్టింది.
అక్టోబర్ 1 తర్వాత దాఖలు చేసిన హెచ్-1బీ పిటిషన్లను యూఎస్సీఐఎస్ రద్దు చేసింది. హెచ్-1బీ వర్కర్లు ఉద్యోగాల్లో చేరేందుకు గడువు అక్టోబర్ 1 తర్వాత ఉండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. దీనికి వ్యతిరేకంగా మార్చి నెలలో.. అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ దావా దాఖలు చేసింది. ఇలా రద్దు చేయడం వల్ల వ్యాపారాల్లో ఇమ్మిగ్రేషన్ సమస్యలు వస్తాయని కౌన్సిల్ పేర్కొంది.
కేసు పరిష్కారమవడం వల్ల.. ఏజెన్సీ చేపడుతున్న చట్టవిరుద్ధ చర్యలను సవాలు చేయడం, ఉద్యోగ ఆధారిత ఇమ్మిగ్రేషన్ ప్రక్రియకు మరింత పారదర్శకత లభించడం వంటివి జరిగాయని అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్లోని సీనియర్ న్యాయవాది లెస్లే డెల్లన్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి:- వీసాదారుల వేతనాలపై ప్రజాభిప్రాయ సేకరణ!