ETV Bharat / international

1.9 ట్రిలియన్​ డాలర్ల ప్యాకేజీకి సెనెట్​ ఆమోదం

కరోనా సంక్షోభం నుంచి అమెరికాను గట్టెక్కించేందుకు అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన రెస్క్యూ ప్యాకేజీకి సెనెట్ ఆమోదం తెలిపిది. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​ టై బ్రేకింగ్ ఓటు హక్కు వినియోగించుకున్న నేపథ్యంలో సెనెట్​లో డెమొక్రాట్ల బలం 51కి పెరిగింది.

author img

By

Published : Feb 6, 2021, 8:49 AM IST

Senate approves budget bill
కరోనా ప్యాకేజీకి సెనేట్ ఆమోదం

కరోనా వైరస్​ నియంత్రణ, ఆర్థిక స్థిరత్వం కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన 1.9 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక ప్రణాళిక అమలు దిశగా మరో ముందడుగు పడింది. సంబంధిత కొవిడ్​-19 ఎయిడ్​ బిల్లుకు.. సెనెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. దీనిపై విస్తృత చర్చ జరిగింది. రిపబ్లికన్​ల మద్దతు అవసరం లేకుండానే ఈ తీర్మానానికి ఆమోదం లభించడం గమనార్హం. అంతకుముందు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.. తన టై బ్రేకింగ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనితో సెనెట్​లో డెమొక్రాట్ల బలం 51కి, రిపబ్లికన్​ సభ్యులు 50కి చేరింది. దీనితో బడ్జెట్ తీర్మాన ఓటింగ్​కు మార్గం సుగమమైంది.

ఆర్థిక ప్రణాళికకు ఆమోదం తెలపడం అమెరికాను తిరిగి రికవరీ బాటలో పట్టేందుకు తొలి అడుగుగా అభివర్ణించారు సెనేట్ మెజారిటీ నేత చక్​ షుమీర్​. వేగవంతమైన నిర్ణయాలతో మార్చి లోపు దీనిని అమలు చేయాలనేదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:'మార్పులు చేస్తే 'ప్యాకేజీ'తో ప్రయోజం ఉండదు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.