ETV Bharat / international

ట్రంప్ X బైడెన్: రెండో డిబేట్ కోసం రూల్స్​ మార్పు

అమెరికా అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్​ మధ్య రెండో డిబేట్​ వర్చువల్​గా జరగనుంది. ట్రంప్​కు కరోనా సోకిన నేపథ్యంలో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వర్చువల్​గా జరిగితే తాను డిబేట్​లో పాల్గొననని ట్రంప్ చెప్పారు.

trump x biden
ట్రంప్ X బైడెన్
author img

By

Published : Oct 8, 2020, 5:38 PM IST

Updated : Oct 8, 2020, 6:04 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా అక్టోబర్​ 15న జరగాల్సిన అభ్యర్థుల రెండో సంవాదం వర్చువల్​గా నిర్వహించనున్నారు. అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్​కు కరోనా సోకిన నేపథ్యంలో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

షెడ్యూల్ ప్రకారం రెండో డిబేట్​ మయామిలో జరగాల్సి ఉంది. తాజా మార్పుల నేపథ్యంలో ఇద్దరు నేతలు వేర్వేరు ప్రాంతాల నుంచి వర్చువల్​గా పాల్గొంటారు. సమన్వయకర్త, ప్రేక్షకులు మాత్రం మయామిలోనే ఉంటారని నిర్వాహకులు తెలిపారు.

ట్రంప్ నిరాకరణ..

వర్చువల్​గా డిబేట్​ జరిగితే తాను పాల్గొననని ట్రంప్ కరాఖండిగా చెప్పారు. ఓ వార్తా సంస్థ ముఖాముఖిలో ఈ విషయాన్ని చెప్పారు. తన ప్రత్యర్థి జో బైడెన్​ను నిర్వాహకులు రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ మధ్య తొలి డిబేట్ సెప్టెంబర్​ 30న క్లీవ్​లాండ్​లో జరిగింది.

ఇదీ చూడండి: ట్రంప్​కు కరోనా తగ్గకపోతే డిబేట్ వద్దు: బైడెన్

Last Updated : Oct 8, 2020, 6:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.