ETV Bharat / international

స్మార్ట్​ వాచీలతో కరోనాను ముందే కనిపెట్టొచ్చు!

స్మార్ట్ వాచీల ద్వారా 9 రోజుల ముందే కరోనా వైరస్​ను గుర్తించవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించారు. మొత్తం 5300 మందిపై అధ్యయనం చేసి, వారిలో కొవిడ్ బారినపడ్డ 32మంది డేటాను విశ్లేషించారు. వీరిలో 26 మందికి(81 శాతం) గుండె స్పందన రేటులో మార్పులు వెలుగు చూశాయి. ఒక రోజులో వేసే అడుగుల సంఖ్య లోనూ, నిద్ర సమయంలోనూ వైరుధ్యాలు కనిపించాయి.

scientists have revealed that the corona virus can be detected  by smart watches
స్మార్ట్​ వాచీలతో కరోనాను ముందే కనిపెట్టొచ్చు!
author img

By

Published : Nov 21, 2020, 7:10 AM IST

వ్యాధి లక్షణాలు బయటపడటానికి 9 రోజుల ముందే స్మార్ట్ వాచీలు, శరీరంపై ధరించే ఇతర సాధనాలతో కొవిడ్-19ను గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇవి నిరంతరం శరీరంలోని ముఖ్య సంకేతాలను పరిశీలించి, కీలక మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తాయని పేర్కొన్నారు. అమెరికాలోని స్టాన్​ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.

మొత్తం 5300 మందిపై అధ్యయనం చేసి, వారిలో కొవిడ్ బారినపడ్డ 32మంది డేటాను విశ్లేషించారు. వీరిలో 26 మందికి(81 శాతం) గుండె స్పందన రేటులో మార్పులు వెలుగు చూశాయి. ఒక రోజులో వేసే అడుగుల సంఖ్య లోనూ, నిద్ర సమయంలోనూ వైరుధ్యాలు కనిపించాయి. 22 కేసుల్లో వ్యాధి లక్షణాలు ప్రారంభం కావడానికి ముందు కానీ, మొదలవుతున్నప్పుడు కానీ మార్పులు కనిపించాయి. నాలుగు కేసుల్లో కనీసం 9 రోజులు ముందు అవి వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్​ వాచీలు ఇతర ఉపకరణాల ద్వారా సదరు వ్యక్తుల కార్యకలాపాలను, ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం ద్వారా శ్వాసకోస ఇన్​ఫెక్షన్లను ఎప్పటికప్పుడు గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. తద్వారా వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం, సకాలంలో చికిత్సకు వీలు కలుగుతుందని వివరించారు.

ప్రస్తుతం చాలా వ్యాధి నిర్ధరణ విధానాల్లో ముక్కు నుంచి ద్రవాలు లేదా, నోటిలోని లాలా జలం లేదా రక్త నమూనాలు తీసి పరీక్షిస్తున్నారు. క్రియాశీల కేసులను గుర్తించేందుకు న్యూక్లిక్​ ఆమ్ల ఆధారిత పరీక్షలు చేస్తున్నారు.

" న్యూక్లిక్ ఆధారిత వ్యాధి నిర్ధరణ పరీక్షలు కచ్చితమైనవే అయినప్పటికీ వ్యాధి సోకిన చాలా రోజుల తర్వాత నమూనాలను సేకరించి, పరీక్షిస్తేనే ఫలితం ఉంటుంది. వాటికయ్యే ఖర్చు కూడా ఎక్కువే. ఆ పరీక్షల్లో ఉపయోగించే కీలక రీఏజెంట్లకు కొరత తలెత్తుతోంది" అని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కోట్ల మంది స్మార్ట్ వాచీలు, ఇతర సాధనాలను వెంట ఉంచుకుంటున్నారని చెప్పారు. అవి గుండె స్పందన రేటు, చర్మ ఉష్ణోగ్రత, నిద్ర వంటి కీలక అంశాలను పరీశిలించగలవని తెలిపారు. వీటి సాయంతో కొవిడ్ కేసులను ముందే పసిగట్టవచ్చని వివరించారు. గుండె స్పందన రేటు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ద్వారా ప్రారంభ దశలోనే ఇన్​ఫెక్షన్​ను గుర్తించే ఒక అల్గారిథమ్​ను తాము రూపొందించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: అగ్రరాజ్యంలో కరోనా 2.0 విలయం- అసలేం జరుగుతోంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.