ETV Bharat / international

కొత్త వీడియోలతో ట్రంప్​కు మరిన్ని చిక్కులు!

author img

By

Published : Feb 12, 2021, 10:18 AM IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఆదేశాల మేరకే ఆందోళనకారులు క్యాపిటల్​ భవనంపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు డెమొక్రాట్లు. అభిశంసనపై విచారణ సందర్భంగా దాడికి సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. తాము ఎదుర్కొన్న భయానక స్థితిని వివరించారు. ఈ వీడియోలు చూసైనా కొంతమంది మనసులు మారుతాయంటూ అధ్యక్షుడు బైడెన్‌ అభిప్రాయపడ్డారు.

Donald trump
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చుట్టూ.. అభిశంసన ఉచ్చు బిగుస్తోంది. క్యాపిటల్‌ హిల్‌ భవనంపై దాడి వేళ తాము ఎదుర్కొన్న భయానక స్థితిని వివరిస్తూ.. డెమొక్రాట్లు మునుపెన్నడూ కనిపించని వీడియోలను ప్రదర్శించారు. ఈ వీడియోల్లో నిరసనకారుల హింసాత్మక చర్యలు స్పష్టంగా కనిపించాయి. ట్రంప్​ ఆదేశాల ప్రకారమే అల్లరి మూకలు క్యాపిటల్​ భవనంపై దాడికి పాల్పడ్డాయని తెలిపారు. బైడెన్​ ఎన్నికను అధికారికంగా ధ్రువీకరించే ప్రక్రియను అడ్డుకునేందుకు హింసకు పాల్పడిన ఘటనలు ట్రంప్​.. హింసాత్మక ధోరణిని ప్రతిబింబించిందని ఆరోపించారు. ఆయా వీడియోల్లో ట్రంప్​ మద్దతుదారుల మాటలు స్పష్టంగా ఉన్నాయి. 'మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించారు' 'మమ్మల్ని ట్రంప్​ పంపారు', 'ట్రంప్​ కోసం పోరాడుతూ మేమంతా సంతోషంగా ఉన్నాం' అని పలువురు ఆందోళనకారులు చెబుతున్నారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను అభిశంసించేందుకు ఉద్దేశించిన తీర్మానంపై సెనేట్‌లో ప్రారంభమైన విచారణలో.. డెమొక్రాట్లు బలమైన వాదనలు వినిపించారు. సభ్యులు ప్రదర్శించిన వీడియోలు క్యాపిటల్‌ హిల్‌ భవనంపై జరిగిన దాడి తీవ్రతకు నిదర్శనంగా నిలిచాయి. మారణాయుధాలు ధరించిన నిరసనకారులు.. మాజీ ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ సహా పలువురు అమెరికా చట్టసభ్యులపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పెన్స్‌ను ఉరి తీయండి అంటూ నినాదాలు చేయడం వంటి దృశ్యాలన్నీ వీడియోలో నిక్షిప్తమై ఉన్నాయి. భద్రతా దళాలు మైక్‌ పెన్స్‌ సహా మరి కొంతమంది ప్రముఖులను మరో మార్గం ద్వారా బయటకు పంపించే దృశ్యాలు ఆ వీడియోల్లో కనిపించాయి. ఈ పోలీసులపై దాడులకు దిగడం వంటి దారుణాలన్నీ అందులో కనిపించాయి. స్పీకర్‌ నాన్సీ పెలోసి, మాజీ ఉపాధ్యక్షుడు పెన్స్‌ల కోసం ఆందోళనకారులు ఆగ్రహంతో వెతకడం వీడియోలో కనిపించింది.

ఉద్వేగపూరిత వాతావరణం..

సెనేట్‌లో వీడియోలు ప్రదర్శస్తున్న సమయంలో సభలో ఉద్వేగపూరిత వాతవరణం నెలకొంది. అనేకమంది సభ్యులు భావోద్వేగానికి గురుయ్యారు. అల్లరిమూకను ఎదుర్కోవడంలో పోలీసులు చూపించిన తెగువను మరికొందరు చెమర్చిన కళ్లతో తలుచుకున్నారు. అమెరికాలో అత్యంత భయంకరమైన రోజులలో ఇదీ ఒకటని డెమొక్రాట్లు అన్నారు.

సెనేట్‌లో ప్రదర్శించిన క్యాపిటల్‌ భవనం దాడి దృశ్యాలు చూసైనా కొందరి మనసులు మారుతాయని తాను నమ్ముతున్నానని అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. నిరసనకారులు హింసాత్మక చర్యలు.. సెనేటర్లు, ప్రజల మనసులను కదిలించాయని అన్నారు. డెమొక్రాట్ల వాదనల అనంతరం.. ట్రంప్‌ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు. అభిశంసన తీర్మానంపై విచారణకు సెనేట్‌లో ఆరుగురు రిపబ్లికన్లు మద్దతు తెలిపారు.

ఇదీ చూడండి: ఎన్నికల అవకతవకల అంశంలో ట్రంప్​పై దర్యాప్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.