ఉత్తర అమెరికా రాష్ట్రాలైన మిన్నెసోటా, విస్కాన్సిన్లలో మంచు భారీగా కురుస్తోంది. రోడ్లపై కార్లు, ఇళ్లు హిమపాతంలో కూరుకుపోయాయి. మిన్నెసోటాలోని దులుత్ రహదారిపై 22 అంగుళాల ఎత్తు మేర మంచు పరుచుకుంది. ఫలితంగా.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
గత కొద్ది రోజులుగా మంచు తుపాను, ఈదురు గాలులతో కూడిన చలి అమెరికాను వణికిస్తోంది. థాంక్స్‌గివింగ్ వారాంతంలో అలజడి సృష్టించిన మంచు తుపాను ప్రభావం ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుతోంది. స్థానికులు రోడ్లపైకి వచ్చి పేరుకుపోయిన మంచును తొలగిస్తున్నారు.
ఇదీ చూడండి : అమెరికా నౌకా దళాన్ని అనుమతించబోం: చైనా