అమెరికా ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిని సొంత పార్టీ నేతలే విభేదిస్తున్నారు. గెలిచినట్లు ముందుగానే ప్రకటించటం, కొన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపును నిలిపేయాలని కోరడాన్ని కొంత మంది రిపబ్లికన్లు తప్పుబడుతున్నారు. ఫలితంగా ట్రంప్ ప్రయత్నాలకు పార్టీలోని కీలక నేతల మద్దతు కరవైంది.
ట్రంప్ వైఖరిని వ్యతిరేకించిన వారిలో రిపబ్లికన్ సెనేటర్లు మిచ్ మెక్కానెల్, మార్కో రుబియో, లీసా ముర్కోస్కీ, ఆడమ్ కింజింజర్ వంటి కీలక నేతలు ఉన్నారు. న్యాయంగా వేసిన ఓట్లను ఎన్ని రోజులు లెక్కించినా తప్పు కాదని, ఫలితాల విషయంలో ప్రతి ఒక్కరూ ఓపికగా ఎదురుచూడాలని సూచించారు.
-
Stop. Full stop. The votes will be counted and you will either win or lose. And America will accept that. Patience is a virtue. https://t.co/iZr78QoPIH
— Adam Kinzinger (@RepKinzinger) November 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Stop. Full stop. The votes will be counted and you will either win or lose. And America will accept that. Patience is a virtue. https://t.co/iZr78QoPIH
— Adam Kinzinger (@RepKinzinger) November 4, 2020Stop. Full stop. The votes will be counted and you will either win or lose. And America will accept that. Patience is a virtue. https://t.co/iZr78QoPIH
— Adam Kinzinger (@RepKinzinger) November 4, 2020
"ఇక చాలు.. ఆపండి. మీరు గెలిచినా ఓడినా.. ఓట్లను లెక్కించాల్సిందే. అమెరికా దాన్ని అంగీకరిస్తుంది. ఓపిక చాలా విలువైనది" అని కింజింజర్ నేరుగా ట్రంప్‌కే ట్వీట్ చేశారు.
నిక్కీ హేలీపై విమర్శలు..
రిపబ్లికన్ పార్టీలో భారత సంతతి నేత నిక్కీ హేలీపై అధ్యక్షుడు కుమారుడు ట్రంప్ జూనియర్ విమర్శలు చేశారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉన్న వ్యక్తులు ప్రస్తుతం 'ఎన్నికల్లో కుట్ర'పై ట్రంప్‌కు మద్దతు ఇవ్వటం లేదని మండిపడ్డారు. దేశంపై భారీ కుట్ర జరుగుతోందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించిన తర్వాత ఆయన కుమారుడు ఈ మేరకు ట్వీట్ చేశారు.
"ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇన్నాళ్లు ట్రంప్ పక్కన కూర్చున్న వాళ్లు నిశబ్దంగా ఉన్నారు. భవిష్యత్తు రిపబ్లికన్ అభ్యర్థులగా చెప్పుకొనేవారు ఎక్కడున్నారు? నిక్కి హేలీ ఏం చేస్తున్నారు? వాళ్ల నుంచి ఎలాంటి స్పందన లేకపోవటం ఆశ్చర్యకరం. "
- ట్రంప్ జూనియర్
ఇదీ చూడండి: ట్రంప్‌కు షాక్.. పిటిషన్లను కొట్టేసిన కోర్టులు