ETV Bharat / international

డ్రాగన్​ 'సైబర్'​ దాడి- ఉడాయ్​, భారత మీడియానే గురి! - cyberattack

అమెరికాకు చెందిన ఓ ప్రైవేటు సైబర్ భద్రతా సంస్థ.. భారత్​కు హెచ్చరిక చేసింది. భారత మీడియా, పోలీసు శాఖ, నేషనల్​ ఐడెంటిఫికేషన్​ ఏజెన్సీ డేటాబేస్​ హ్యాకింగ్​కు గురైనట్లు తమకు తెలిసిందని పేర్కొంది. ఇది చైనా పనేనని అనుమానం వ్యక్తం చేసింది.

F
F
author img

By

Published : Sep 22, 2021, 7:55 PM IST

Updated : Sep 23, 2021, 9:32 AM IST

భారత్​కు చెందిన మీడియా, పోలీసు శాఖ, నేషనల్​ ఐడెంటిఫికేషన్​ ఏజెన్సీ డేటాబేస్​ హ్యాకింగ్​కు గురైనట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన 'రికార్డెడ్‌ ఫ్యూచర్‌' అనే ప్రైవేటు సైబర్‌ భద్రత కంపెనీ పరిశోధక విభాగం- 'ఇన్‌సిక్ట్‌ గ్రూప్‌' బుధవారం ఈ మేరకు సంచలన వివరాలను బయటపెట్టింది. తమకు ఆధారాలు కూడా లభించాయని తెలిపింది. అయితే.. ఇది చైనా ప్రభుత్వ మద్దతు ఉన్న ఓ సంస్థ పనేనని అనుమానిస్తోంది.

హ్యాకింగ్​ చేసిన గ్రూప్​ పేరును TAG-28గా(తాత్కాలికం) పేర్కొన్న ఇన్​సిక్ట్​.. హ్యాకర్లు వింటీ అనే మాల్​వేర్​ను ఉపయోగించినట్లు తెలిపింది. చైనాలో ప్రభుత్వరంగ సంస్థలకు మాత్రమే ఈ మాల్​వేర్​ అందుబాటులో ఉంటుందని, అందుకని ఇది చైనా పనేనని స్పష్టం చేసింది.

అయితే వెంటనే స్పందించిన చైనా అధికారులు.. దీనిని తిరస్కరించారు. సైబర్​ దాడులను తాము ఏమాత్రం సహించబోమన్నారు.

ఇరు దేశాల మధ్య ఇప్పటికే సరిహద్దు వివాదం నెలకొన్న వేళ.. సైబర్​ దాడుల ఆరోపణలు ఆ ఉద్రిక్తతల్ని మరింత పెంచేలా ఉన్నాయి.

భారత ప్రభుత్వం, మీడియా వర్గాలను లక్ష్యంగా చేసుకొని చైనా సంస్థ ఒకటి హ్యాకింగ్‌కు తెగబడిందన్న ఈ వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. ప్రధానంగా.. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్‌), మధ్యప్రదేశ్‌ రాష్ట్ర పోలీసు విభాగం నుంచి హ్యాకర్లు సమాచార తస్కరణకు పాల్పడినట్లు తెలుస్తోంది.

ఇన్‌సిక్ట్‌ గ్రూప్‌ తెలిపిన వివరాల ప్రకారం..

2020తో పోలిస్తే ఈ ఏడాది భారతీయ సంస్థలను లక్ష్యంగా చేసుకొని చైనీయుల హ్యాకింగ్‌ కార్యకలాపాలు భారీగా పెరిగాయి. దాదాపుగా అవన్నీ ప్రభుత్వ ప్రాయోజితమే. గత ఏడాదితో పోలిస్తే 2021లో (ఆగస్టు వరకే) భారత్‌ లక్ష్యంగా చైనా హ్యాకర్ల కార్యకలాపాలు 261 శాతం అధికంగా నమోదయ్యాయి. ప్రధానంగా ట్యాగ్‌-28 (సూచనప్రాయంగా పెట్టిన పేరు) అనే కంపెనీ 'వింటీ' మాల్‌వేర్‌తో సైబర్‌ దాడులకు పాల్పడింది. ముంబయికి చెందిన ఓ ప్రైవేటు కంపెనీ నెట్‌వర్క్‌ నుంచి దాదాపు 500 మెగాబైట్ల డేటాను తస్కరించింది. ఆ డేటా ఏంటనేది స్పష్టంగా తెలియరాలేదు. అయితే అది భారత్‌-చైనా మధ్య ఉద్రిక్తతలకు సంబంధించిన సమాచారం కావొచ్చని అంచనాలున్నాయి.

మధ్యప్రదేశ్‌ రాష్ట్ర పోలీసు విభాగం నుంచి కూడా 5 మెగాబైట్ల డేటాను ట్యాగ్‌-28 అపహరించింది. జాతీయ గుర్తింపు డేటాబేస్‌ను పర్యవేక్షించే ఉడాయ్‌పైనా ఈ ఏడాది జూన్‌, జులైల్లో హ్యాకింగ్‌కు పాల్పడింది. దాదాపు 10 మెగాబైట్ల డేటాను తస్కరించి.. 30 మెగాబైట్ల వరకు డేటాను అందులో అప్‌లోడ్‌ చేసింది. ప్రముఖులను గుర్తించి లక్ష్యంగా చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా ఉడాయ్‌పై సైబర్‌ దాడి జరిపి ఉండొచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Last Updated : Sep 23, 2021, 9:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.