ETV Bharat / international

పురాతన పాఠశాలలో 600 అస్థిపంజరాలు! - పాఠశాల్లో అస్థిపంజరులు

వందలకొద్దీ చిన్నారుల అస్థి పంజరాలతో కెనడా మరోసారి ఉలిక్కిపడింది. గతనెల బ్రిటిష్‌ కొలంబియాలో మూసివున్న పాఠశాల ప్రాంగణంలో 200అస్థిపంజరాలు బయటపడగా తాజాగా వాంకోవర్‌లోని మరో రెసిడెన్షియల్‌ స్కూల్‌ ప్రాంగణంలో 600లకు పైగా అస్థి పంజరాలను గుర్తించారు. దీంతో ఆశ్రమ పాఠశాలల్లో ఏదో ఘాతుకం జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతుండగా నిజానిజాలు నిగ్గు తేల్చనున్నట్లు కెనడా ప్రధాని ట్రూడో ప్రకటించారు.

bodies
అస్థిపంజరాలు
author img

By

Published : Jun 25, 2021, 7:01 AM IST

Updated : Jun 25, 2021, 12:46 PM IST

ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలున్న కామ్‌లూప్స్‌ ఇండియన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ప్రాంగణంలో గతనెల 215మంది పిల్లల అస్థిపంజరాలు బయటపడ్డాయి. మృతుల్లో మూడేళ్ల చిన్నారులు కూడా ఉన్నారు. ఒక రాడార్‌ ద్వారా లభ్యమైన సమాచారంతో ఈ దారుణం వెలుగు చూసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కెనడావ్యాప్తంగా మూసివున్న రెసిడెన్షియల్‌ స్కూళ్లపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో కొవెస్సెస్‌ ఫస్ట్‌ నేషన్‌ ప్రాంతంలోని మారివల్‌ ఇండియన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ప్రాంగణంలో రాడార్‌ ద్వారా అన్వేషించగా వందలకొద్దీ సమాధులు బయటపడ్డాయి. 600మందికి పైగా చిన్నారులను సమాధి చేసినట్లు భావిస్తున్న అధికారులు తవ్వకాల ద్వారా పిల్లల అవశేషాలను బయటకు తీస్తున్నారు. ఈ ఆశ్రమ పాఠశాల 1899 నుంచి 1997 మధ్య రోమన్‌ కాథలిక్‌ చర్చి ఆధ్వర్యంలో నడిచింది.

6వేల మంది..

19వ శతాబ్దం నుంచి 1970ల వరకు కెనడాలో లక్షన్నర మందికిపైగా చిన్నారులను క్రిస్టియన్‌ స్కూళ్లలో బలవంతంగా చేర్చినట్లు తెలిసింది. ఈ పాఠశాలల్లో అత్యధికం.. రోమన్‌ కాథలిక్‌ మిషనరీ ఆధ్వర్యంలోనే నడిచేవి. ఒకప్పుడు ఇక్కడి పాఠశాలల్లో బలవంతపు మత మార్పిళ్లు జరిగేవనీ, మాటవినని వారిని తీవ్రంగా కొట్టేవారనీ చెబుతారు. చిన్నారులపై శారీరక, లైంగిక వేధింపులు జరిగేవని, మాతృభాష మాట్లాడినందుకు పిల్లలను చితకబాదేవారని ఇటీవల కెనడా ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఇలాంటి చర్యల వల్ల కనీసం 6వేల మంది చనిపోయి ఉంటారని ఒక అంచనా.

మరోవైపు విద్యాసంస్థల్లో పిల్లల పట్ల దారుణాలు జరిగాయని ఐదేళ్ల క్రితం నిజ నిర్ధరణ కమిషన్‌ ఒక నివేదిక సమర్పించింది. సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల కనీసం 3200 మంది పిల్లలు చనిపోయి ఉంటారని, ఒక్క కామ్‌లూప్స్‌ పాఠశాలలోనే 1915-1963 మధ్య 51మరణాలు సంభవించినట్లు ఆ నివేదిక పేర్కొంది. అయితే ఈ ఆశ్రమ పాఠశాలల్లో అంతకుమించిన స్థాయిలో ఏదో ఘాతుకం జరిగినట్లు తాజా పరిణామాలు చాటుతున్నాయి.

ప్రధాని దిగ్భ్రాంతి..

తాజా ఘటనలపై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ట్విటర్‌ వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మారివల్ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో చిన్నారుల అస్థి పంజరాలు బయటపడినవార్త విన్న తర్వాత తన గుండె బద్దలైనట్లు చెప్పారు. ఈ దారుణాల వెనుక వాస్తవాలను బయటపెడతామని ట్రూడో ట్వీట్‌ చేశారు. దేశవ్యాప్తంగా ఇలాంటి పాఠశాలలు చాలానే ఉన్నాయి. వాటన్నింటిలో తవ్వకాలు జరిపితే అస్థి పంజరాల లెక్క ఎంతవరకు వెళ్తుందో అనే ఆందోళన కెనడా ప్రజల్లో వ్యక్తమవుతోంది.

ఇదీ చూడండి : గిన్నిస్​ రికార్డుల్లోకి ఆ జంట.. ఎలాగంటే?

Last Updated : Jun 25, 2021, 12:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.