తుపాను కారణంగా బ్రెజిల్ దేశస్థులు వణికిపోతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మినాస్ గెరాయిస్ రాష్ట్రంలో ఇద్దరు చిన్నారులు సహా ఇప్పటివరకు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. 16 మంది గల్లంతు కాగా.. ఇళ్లపై కొండచరియలు విరిగిపడి మరో 3500 మంది నిరాశ్రయులయ్యారు.
ప్రమాదం జరిగిన చోటే మళ్లీ
మరో 24 గంటలపాటు తుపాను కొనసాగే ఆవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గతేడాది ఇదే రాష్ట్రం బ్రూమాడిన్హోలో ఓ జలాశయ ఆనకట్ట కూలి 270 మంది మరణించారు. ఈ దుర్ఘటనలో గల్లంతయిన 11మంది ఆచూకి నేటికీ లభించలేదు. అయితే అదే ప్రాంతంలో తాజాగా తుపాను చెలరేగినందున స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.