భారత్‌తో భాగస్వామ్యం కోసం(India US strategic partnership) అధ్యక్షుడు జో బైడెన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎంతో ఆసక్తితో ఉందని, అందుకు మొత్తం ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు అమెరికా-ఇండియా బిజినెస్ కౌన్సిల్(us India business council meeting) అధినేత నిశా దేశాయ్ బిస్వాల్. రెండు ప్రజాస్వామ్య దేశాలు భవిష్యత్తులో గొప్ప అవకాశాలను అందిపుచ్చుకోవటంపై(India America relations) ప్రధానంగా దృష్టిసారించినట్లు చెప్పారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆచరణాత్మకమైన నేతలని కొనియాడారు నిశా.
అమెరికా ఛాంబర్లో జరిగిన యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ సమావేశంలో(us India business council meeting).. సరికొత్త సాంకేతిక అవకాశాలు, ఆర్థిక సాయం, భారత్ క్లీన్ ఇన్ఫ్రాలో పెట్టుబడుల అంశాలపై చర్చించినట్లు చెప్పారు నిశా. మోదీ, బైడెన్లు ఆర్థిక, వాణిజ్య భాగస్వామ్యంపై ఎలా వ్యవహరిస్తారనే దానిపై వాణిజ్య సహకారం ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ఈవారం చివర్లో చేపట్టనున్న మోదీ అమెరికా పర్యటనపైనా(modi us visit 2021) పలు విషయాలు వెల్లడించారు.
" భారత్‌తో భాగస్వామ్యం కోసం బైడెన్ పరిపాలన విభాగం ఎంతో ఆసక్తిగా ఉంది. మోదీ, బైడెన్ల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ వారం చివర్లో శ్వేతసౌధంలో తొలిసారి వారు నేరుగా కలవనున్నారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక, క్వాడ్‌తో పాటు యూఎన్జీఏ భేటీల్లో పాల్గొంటారని భావిస్తున్నా. ఆ సమావేశాల్లో కరోనా మహమ్మారి కీలక అంశంగా మారనుంది. ప్రధానంగా ఈ అంశంపైనే దృష్టి పెడతారనుకుంటున్నా. అలాగే.. ఇరు దేశాల మధ్య పర్యావరణ మార్పులపై భాగస్వామ్యం కీలకంగా మారనుంది. ఈ-మొబిలిటీలో గ్రీన్ హైడ్రోజన్, సరఫరా గొలుసును ఏర్పాటు చేయటం వంటి అంశాల్లో భారత్ దృష్టి సారించింది. ఇరు దేశాలను మరింత బలమైన భాగస్వామ్యం దిశగా నడిపించే అవకాశాన్ని ఇరువురు నేతలు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నా."
- నిశా దేశాయ్ బిస్వాల్, భారత్-అమెరికా వాణిజ్య కౌన్సిల్ అధ్యక్షురాలు.
ఒబామా ప్రభుత్వంలో సెంట్రల్ ఆసియాకు విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా విధులు నిర్వర్తించారు నిశా దేశాయ్. 2014లో ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో కీలక పాత్ర పోషించారు.
తొలిసారి నేరుగా నిర్వహిస్తున్న క్వాడ్(quad meeting 2021) సమావేశంలో పాల్గొనేందుకు ఈ వారంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ(modi us visit 2021).. అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు.
ఇదీ చూడండి: modi US visit 2021: అమెరికాలో మోదీ షెడ్యూల్ ఇదే!