మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు నేపథ్యంలో.. ఆ దేశంతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాన్ని నిలిపివేసింది అమెరికా. '2013 టీఐఎఫ్ఏ' ప్రకారం కుదుర్చుకున్న ఒప్పందాలన్నింటినీ తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మయన్మార్‌లో సైనిక పాలన అంతమై ప్రజాస్వామ్య స్థాపన జరిగే వరకు ఇది కొనసాగుతుందని పేర్కొంది.
"మయన్మార్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పునఃస్థాపించడానికి అమెరికా మద్దతు ఉంటుంది. మయన్మార్ భద్రతా దళాల హింసను అమెరికా ఖండిస్తోంది. నిరసనకారులను, విద్యార్థులను, వైద్యులను, పిల్లలను అని చూడకుండా చంపడం అంతర్జాతీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది."
-కేథరిన్ తాయ్, అమెరికా వాణిజ్య ప్రతినిధి
సోమవారం వెలువడిన ఈ ప్రకటనతో మయన్మార్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు పూర్తిగా ఆగిపోవు. కానీ, ఆర్థికపరమైన ఆంక్షలు కొనసాగుతాయి. రెండు దేశాల వాణిజ్యం భారీ స్థాయిలో ఏమీ ఉండదు. మయన్మార్ గత సంవత్సరం అమెరికాకు 84వ అతిపెద్ద భాగస్వామిగా ఉంది. మయన్మార్‌కు అమెరికా వస్తువుల ఎగుమతులు 338 మిలియన్ డాలర్లు మాత్రమే.
ఇదీ చదవండి: పాక్‌లో లాక్డౌన్- బ్రిటన్‌లో ఆంక్షల సడలింపు